Mahadev App Case | మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. పోలీసుల ఎదుట హాజరైన నటుడు సాహిల్ ఖాన్
Mahadev App Case | మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో నటుడు సాహిల్ ఖాన్ శనివారం ముంబయి పోలీసుల ఎదుట హాజరయ్యాడు. ఈ కేసులో పలువురు స్టార్లతో పాటు నటుడు సాహిల్ పేరు సైతం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.
Mahadev App Case | మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో నటుడు సాహిల్ ఖాన్ శనివారం ముంబయి పోలీసుల ఎదుట హాజరయ్యాడు. ఈ కేసులో పలువురు స్టార్లతో పాటు నటుడు సాహిల్ పేరు సైతం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసు విచారణలో పాల్గొనేందుకు సాహిల్ ముంబయి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. మాతుంగా పోలీస్‌లో కేసు నమోదు కాగా.. కేసు దర్యాప్తు కోసం ముంబయి క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. ఈ కేసులో సిట్‌ను ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేశారు.
మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో డిసెంబర్ 2023లో ముంబై సైబర్ సెల్‌లోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సాహిల్‌తో పాటు మరో ముగ్గురికి సమన్లు జారీ చేసింది. డిసెంబర్లో సిట్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే, ఆ సమయంలో సాహిల్ విచారణకు గైర్హాజరయ్యాడు. ఈ కేసులో దాదాపు రూ.15వేలకోట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలున్నాయి. గతేడాది ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన రవి ఉప్పల్‌ను స్థానిక అధికారులు దుబాయిలో అదుపులోకి తీసుకున్నారు. ఈడీ ఆదేశాల మేరకు ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసుల ఆధారంగా దుబాయి పోలీసులు అరెస్టు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సాహిల్ సినిమా నటుడే కాకుండా ఫిట్నెస్ నిపుణుడు కూడా. స్టయిల్, ఎక్స్క్యూజ్ మీ తదితర చిత్రాల్లో నటించాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

