Madya Pradesh | భోపాల్: ఫోన్లో అశ్లీల వీడియోలు చూసి చెల్లిపై లైంగిక దాడికి పాల్పడి, ఆ చిన్నారిని తల్లితో కలిసి హతమార్చాడు ఓ బాలుడు. మూడు నెలల క్రితం మధ్య ప్రదేశ్లోని రెవా జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అదనపు ఎస్పీ వివేక్ లాల్ కథనం ప్రకారం.. పెరట్లో నిద్రి స్తుండగా ఫోన్లో అశ్లీల వీడియోలు చూసిన బాలుడు.. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, గొంతు నులిమాడు. ఈ విషయాన్ని తల్లికి చెప్పగా ఆమె వచ్చి చూసేటప్పటికి బాలిక ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నది. దీంతో తల్లే కన్నకూతురి గొంతు నులిమి ప్రాణం తీసింది. విషపురుగు కరిచి బాలిక చనిపోయిందని తల్లి నాటక మాడింది. పోలీసుల విచారణలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.