కరోనా పోవాలంటూ.. ఎయిర్పోర్ట్లో మంత్రి పూజ
ఉషా ఠాకూర్ | కరోనా పోవాలంటూ ఒక మంత్రి ఎయిర్పోర్ట్లో పూజ చేశారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక

భోపాల్: కరోనా పోవాలంటూ ఒక మంత్రి ఎయిర్పోర్ట్లో పూజ చేశారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ శుక్రవారం ఇండోర్ విమానాశ్రయంలోని దేవి అహిల్య బాయి హోల్కర్ విగ్రహం ఎదుట పూజలు చేశారు. కరోనా పోవాలంటూ భక్తి గీతాలు ఆలపిస్తూ చేతులతో భజన చేశారు. విమానాశ్రయం డైరెక్టర్ ఆర్యమా సన్యాస్, ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మరోవైపు మంత్రి ఉషా ఠాకూర్ ఈసారి కూడా మాస్క్ ధరించలేదు. తొలి నుంచి ఆమె మాస్క్ ధరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తాయి. అయితే తాను ప్రతి రోజు పూజలు, హోమాలు చేస్తానని, హనుమాన్ చాలిసాను పఠిస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించాల్సిన అవసరం తనకు లేదన్నారు. అలాగే ఆవు పేడతో చేసిన పిడకను కాల్చి ఇంట్లో ఉంచితే 12 గంటలపాటు శానిటైజ్ చేస్తుందని గతంలో ఆమె పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

