Lokayukta Raids | కరెన్సీ కట్టలు.. కిలోల్లో నగలు.. లగ్జరీ కార్లు.. టన్నుల్లో తేనె.. ఆ రిటైర్డ్ ఇంజీనీర్ సంపద చూస్తే షాక్..!
Lokayukta Raids | పదవీ విరమణ పొందిన ఓ ప్రభుత్వ ఇంజినీర్ (Govt Engineer) సంపద చూసి అధికారులు షాకయ్యారు. లోకాయుక్త అధికారులు (Lokayukta officials) ఆయన ఇళ్లల్లో సోదాలకు వెళ్లగా.. కుప్పలు కుప్పలుగా కరెన్సీ కట్టలు (Currency notes), కిలోల కొద్దీ నగలు బయటపడ్డాయి.
Lokayukta Raids : పదవీ విరమణ పొందిన ఓ ప్రభుత్వ ఇంజినీర్ (Govt Engineer) సంపద చూసి అధికారులు షాకయ్యారు. లోకాయుక్త అధికారులు (Lokayukta officials) ఆయన ఇళ్లల్లో సోదాలకు వెళ్లగా.. కుప్పలు కుప్పలుగా కరెన్సీ కట్టలు (Currency notes), కిలోల కొద్దీ నగలు బయటపడ్డాయి. ఆయన ఫామ్‌హౌస్‌లో దొరికిన 17 టన్నుల తేనె (Honey) ను చూసి అధికారులు అవాక్కయ్యారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ప్రజాపనుల విభాగంలో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేసి రిటైర్ అయిన జీపీ మెహ్రా లగ్జరీ లైఫ్‌స్టైల్ ఇది.
ఓ అప్రకటిత ఆస్తుల వ్యవహారంలో తీగ లాగితే మెహ్రా బండారం బయటపడిందని ఆంగ్ల మీడియా కథనం వెల్లడించింది. వివరాల్లోకి వెళితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు చేస్తుండగా జీపీ మెహ్రా పేరు వినిపించింది. దాంతో అధికారులు ఆయనపై దృష్టిసారించారు. ఈ క్రమంలోనే భోపాల్, నర్మదాపురంలోని మెహ్రా నివాసాల్లో లోకాయుక్త అధికారులు తనిఖీలు చేపట్టారు. నలుగురు డీఎస్పీ ర్యాంక్ అధికారుల నేతృత్వంలో ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి.
మణిపురంలోని మెహ్రా నివాసంలో అధికారులు 8.79 లక్షల నగదు, రూ.50 లక్షల విలువ చేసే ఆభరణాలు, రూ.56 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను గుర్తించారు. ఇక దనాపానీలో మెహ్రాకు ఓ లగ్జరీ అపార్టుమెంట్ ఉంది. అందులో అధికారులు తనిఖీలు చేయగా.. భారీగా నోట్ల కట్టలు, రూ.3 కోట్ల విలువచేసే రూ.2.6 కిలోల బంగారం, 5.5 కిలోల వెండిని గుర్తించినట్లు సదరు కథనం పేర్కొంది. నర్మదాపురంలో మెహ్రాకు చెందిన ఫామ్‌హౌస్‌కు వెళ్లగా కళ్లుచెదిరే ఆయన విలాసాలు చూసి అధికారులు కంగుతిన్నారు.
ప్రైవేటు సామ్రాజ్యాన్ని తలపించేలా ఆ వ్యవసాయ క్షేత్రంలో 32 అధునాతన కాటేజీలు నిర్మాణ దశలో ఉన్నాయి. మరో ఏడు కాటేజీలను పూర్తిచేశారు. మధ్యలో చెరువు, గోశాల, ఆలయం, నాలుగు లగ్జరీ కార్లు కన్పించాయి. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏందంటే.. ఆయన ఫామ్‌హౌస్ నుంచి ఏకంగా 17 టన్నుల తేనెను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అనుమతి లేకుండా ఆయన తేనె సాగు చేస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
మెహ్రా ఆస్తులపై దర్యాప్తు చేపట్టామని, ఆయన ఆస్తుల లెక్కింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఆయన సంపద రూ.వందల కోట్లలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆయన బ్యాంకు రికార్డులు, డిజిటల్ ఫైళ్లను ఫోరెన్సిక్ బృందాలు తనిఖీ చేస్తున్నాయని చెప్పారు. మెహ్రా బినామీ పెట్టుబడులపైనా అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

