మాస్కులు ధరించడం, భౌతిక దూరంపై రామ భక్తుల ప్రచారం

బెంగళూరు: కరోనా నేపథ్యంలో శ్రీరామ నవమిని పందిళ్లలో భక్తులు జరుపుకోలేకపోయారు. సీతారాముల కళ్యాణాన్ని మండపాల్లో నిర్వహించలేకపోయారు. ఈ నేపథ్యంలో దేశంలోని పలు చోట్ల రామ భక్తులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడంపై ప్రజలకు అవగాహన కల్పించారు. కర్ణాటకలో కరోనా మహమ్మారి మరోసారి తన ప్రతాపం చూసుతున్నది. దీంతో బహిరంగ, సామూహిక శ్రీరామ నవమి వేడులకు భక్తులు దూరంగా ఉన్నారు.
అయితే మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడంతో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలని బెంగళూరులోని శ్రీరామ సేవా మండళ్లు, ఆలయ ట్రస్ట్‌లు నిర్ణయించాయి. ఇందులో భాగంగా బుధవారం శ్రీరామ నవమి సందర్భంగా రామ భక్తులు కరోనాపై అవగాహన కల్పించారు. రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడి వేషధారణలో ఇంటింటికి వెళ్లి మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు సూచించారు. కొన్ని ప్రాంతాల్లో మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. ఈ విధంగా శ్రీరామ నవమినాడు తమ రామ భక్తిని చాటుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

