లఖింపూర్ ఖేరీ ఘటన.. లోక్సభ 2 గంటల వరకు వాయిదా

న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరిలో జరిగిన హింసాకాండపై సిట్ సంచలన విషయాలు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో భాగమైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను తొలగించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. లోక్సభలో ఇవాళ విపక్ష సభ్యులు ఆ అంశంపై చర్చ చేపట్టాలని కోరారు. నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకువెళ్లారు. ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. స్పీకర్ బిర్లా ఎంత వారించినా వాళ్లు వినలేదు. సభ్యులు మాస్క్ ధరించి తమ నిరసన వ్యక్తం చేయాలని మంత్రి ప్రహ్లాద్ జోషి కోరారు. అయితే విపక్ష సభ్యులు పట్టించుకోలేదు. నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు అడ్డు తగిలారు. దీంతో స్పీకర్ బిర్లా సభను ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. అంతకముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. మంత్రి అజయ్ మిశ్రాను తొలగించాలని తన తీర్మానంలో కోరారు. మరో వైపు 12 మంది ఎంపీలపై విధించిన వేటును ఎత్తివేయాలని కోరుతూ రాజ్యసభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో సభను 12 గంటల వరకు చైర్మెన్ వాయిదా వేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్లో టెకీ ప్రపంచం
Fire accidents | పండుగ పూట హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

