Live Streaming | స్కూళ్లు, కాలేజీల్లో చంద్రయాన్-3 ల్యాండింగ్ దృశ్యాల ప్రత్యక్ష ప్రసారం.. అధికారులకు తెలంగాణ సర్కారు ఆదేశాలు
Live Streaming | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) జూలై 14న ప్రయోగించిన చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ బుధవారం (ఆగస్టు 23) సాయంత్రం చుంద్రుడిపై దిగనుంది. ఈ ల్యాండింగ్ ప్రక్రియ సజావుగా పూర్తవుతుందా, లేదా అనే విషయంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది.
హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) జూలై 14న ప్రయోగించిన చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ బుధవారం (ఆగస్టు 23) సాయంత్రం చుంద్రుడిపై దిగనుంది. ఈ ల్యాండింగ్ ప్రక్రియ సజావుగా పూర్తవుతుందా, లేదా అనే విషయంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 చందమామపై దిగే అద్భుతాన్ని రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి చూపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థుల కోసం లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దాంతో డీఈవోలకు, ప్రిన్సిపల్స్‌కు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు తెలంగాణ విద్యా ఛానెల్స్ అయిన టీ శాట్, నిపుణలో లైవ్ టెలికాస్ట్కు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రత్యేక స్క్రీన్లు, ప్రొజెక్టర్లను సిద్ధం చేస్తున్నారు. బుధవారం సాయంత్రం 5.20 గంటల నుంచి టీ శాట్, నిపుణ ఛానెళ్లలో లైవ్ ప్రారంభం అవుతుంది. సాయంత్రం సరిగ్గా 6.04 గంటలకు స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడిపై దిగనుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

