పాట్నా: బీహార్లోని పాట్నాలో యువజన నిరసనలో పాల్గొన్న ఆరేండ్ల బాలుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. బీహార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, సీఎం రాజీనామా చేయలని డిమాండ్ చేస్తున్న ఆ బాలుడి వీడియోలు వైరల్గా మారాయి. అయితే నిరసన స్థలం నుంచి ఆ చిన్నారిని పోలీసులు తరలిస్తున్న ఒక వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బాలుడిని అదుపులోనికి తీసుకున్నందుకు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) పోలీసులపై మండిపడింది. 70వ బీపీఎస్సీ పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, వందలాదిమంది విద్యార్థులు ఆందోళన చేపట్టడంతో ఆ బాలుడు పాట్నాలోని డాక్ బంగ్లా చౌరస్తా వద్దకు వచ్చాడు.