Delhi floods | ఢిల్లీ వరదలపై ఆలస్యంగా స్పందన.. ఎల్జీ, ఆప్ మంత్రి మధ్య వాదన
Delhi floods | దేశ రాజధాని ఢిల్లీని వరదలు (Delhi floods) ముంచెత్తాయి. యమునా నది పొంగిపొర్లడంతో నగరంలోని ప్రముఖ ప్రాంతాలు నీట మునిగాయి. అయితే చర్యల కోసం ఆలస్యంగా స్పందించడానికి మీరు బాధ్యులంటే మీరు బాధ్యులని లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనా, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆమ్) మంత్రి సౌరభ్ భరద్వాజ్ మీడియా ఎదుట వాదులాడుకున్నారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని వరదలు (Delhi floods) ముంచెత్తాయి. యమునా నది పొంగిపొర్లడంతో నగరంలోని ప్రముఖ ప్రాంతాలు నీట మునిగాయి. అయితే చర్యల కోసం ఆలస్యంగా స్పందించడానికి మీరు బాధ్యులంటే మీరు బాధ్యులని లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనా, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆమ్) మంత్రి సౌరభ్ భరద్వాజ్ మీడియా ఎదుట వాదులాడుకున్నారు. ఒకరిని మరొకరు విమర్శించుకున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎదుటే ఇదంతా జరిగింది.
ఢిల్లీ ఇంద్రప్రస్థ ప్రాంతంలోని ప్రధాన కాలువ నీటి ప్రవాహాన్ని నియంత్రించే రెగ్యులేటర్ ధ్వంసమైంది. దీంతో ఐటీవో, రాజ్‌ఘాట్ ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. అయితే రెగ్యులేటర్‌ను సరిచేయడంలో ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది చేతులెత్తేశారు. చివరకు ఆర్మీ ఇంజినీరింగ్ సిబ్బంది రంగంలోకి దిగారు. ధ్వంసమైన రెగ్యులేటర్‌ను సరి చేశారు. దీంతో ప్రధాన ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టింది.
కాగా, ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా, సీఎం అరవింద్ కేజ్రీవాల్, మంత్రి సౌరభ్ భరద్వాజ్, మరి కొందరు మంత్రులు, అధికారులు శుక్రవారం ఉదయం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎల్జీ, మంత్రి భరద్వాజ్ మీడియా ఎదుటే వాగ్వాదానికి దిగారు. ఢిల్లీపై కేంద్రం ఆర్డినెన్స్ వల్ల ఎల్జీ నియంత్రణలో ఉన్న అధికారులు తమ ఆదేశాలను లెక్కచేయలేదని మంత్రి భరద్వాజ్ ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో ఇలా జరిగి ఉంటే ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిన అధికారులను వెంటనే తొలగించి జైల్లో పెట్టేవారని మండిపడ్డారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గత రాత్రే వచ్చి ఉంటే జనం ఇంత ఇబ్బంది పడేవారు కాదని అన్నారు.
మరోవైపు ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ వ్యాఖ్యలపై ఎల్జీ సక్సేనా స్పందించారు. అపరిపక్వ, అవగాహన లేని మాటలు మాట్లాడవద్దని అన్నారు. రాజకీయ దురుద్దేశంతో కేంద్ర ఆర్డినెన్స్ ప్రస్తావన తెస్తున్నారని విమర్శించారు. జలబోర్డు చైర్మన్ అయిన భరద్వాజ్ పరిధిలోనే ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ ఉందన్నారు. వరదలు ముంచెత్తి 12 గంటలకు పైగా గడిచినా అవసరమైన పనులు చేయలేదని విమర్శించారు. చివరకు తన జోక్యం వల్ల ధ్వంసమైన రెగ్యులేటర్‌ను ఆర్మీ ఇంజినీరింగ్ సిబ్బంది సరి చేసినట్లు వెల్లడించారు. అయితే ఎల్జీ, ఆప్ మంత్రి మధ్య జరిగిన ఈ వాదనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
कल रात यहां आपातकालीन स्थिति थी इसलिए मैंने कल रात 11:09 पर अश्विनी जी को ग्रुप में व्हाट्स एप किया NDRF की टीम भेज दीजिये लेकिन नहीं भेजी गई।
अगर कल रात ही एनडीआरएफ की टीम भेज दी जाती तो इतनी दिक्कतें नहीं आती। pic.twitter.com/dpiRUJcZMr
— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) July 14, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

