Watch: పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Leopard Enters Police Station | ఒక చిరుత పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించింది. (Leopard Enters Police Station) దానిని చూసి పోలీస్ సిబ్బంది దాక్కున్నారు. అయితే అక్కడున్న కుక్కలు భయంతో పరుగులు తీశాయి. ఒక కుక్క వెంటపడిన ఆ చిరుత దానిని నోట కరుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ముంబై: ఒక చిరుత పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించింది. (Leopard Enters Police Station) దానిని చూసి పోలీస్ సిబ్బంది దాక్కున్నారు. అయితే అక్కడున్న కుక్కలు భయంతో పరుగులు తీశాయి. ఒక కుక్క వెంటపడిన ఆ చిరుత దానిని నోట కరుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ పోలీస్ స్టేషన్లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం రాత్రి వేళ రాజాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలోకి చిరుత పులి వచ్చింది. అక్కడ తిరుగుతున్న కుక్కలు చిరుతను చూసి భయపడి పోలీస్ స్టేషన్లోకి వెళ్లాయి. చిరుత కూడా ఆ కుక్కలను వెంబడిస్తూ పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించింది. ఒక గదిలోకి దూరిన కుక్కను నోట కరుచుకుంది. అనంతరం అక్కడి నుంచి ఆ చిరుత వెళ్లిపోయింది.
కాగా, చిరుత పోలీస్ స్టేషన్లోకి రావడం చూసి పోలీస్ సిబ్బంది కూడా భయాందోళన చెందారు. సురక్షిత ప్రాంతంలో వారు దాక్కున్నారు. చిరుత కుక్కను వేటాడి నోట కరుచుకుని వెళ్లిన తర్వాత వారంతా బయటకు వచ్చారు. మరోవైపు ఆ పోలీస్ స్టేషన్లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Video: पोलिस ठाण्यात रात्रीच्या वेळी घुसला बिबट्या अन् पकडली मान…
रत्नागिरी जिल्ह्यातील राजापूर तहसील कार्यालय आणि पोलीस ठाण्याच्या व्हरांड्यातुन कुत्र्याच्या मानेला पकडून नेले आहे.https://t.co/42LUDp6Iqz#leopard #Police #PoliceKaka @RatnagiriPolice pic.twitter.com/CP3eXJz3sX— policekaka News (@policekaka) January 25, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

