ముంబై: ఐఐటీ బాంబే క్యాంపస్(IIT Bombay Campus)లోకి ఓ చిరుత ప్రవేశించింది. స్టాఫ్ హాస్టల్ ఏరియాలో ఓ కుక్కను చంపేసింది. పోవాయ్‌లో ఉన్న వర్సిటీ సీసీ కెమెరాలకు ఆ ఘటన చిక్కింది. ఈ ఘటన 19వ తేదీ తెల్లవారుజామున రెండు గంటలకు జరిగింది. క్యాంపస్‌లోకి చిరుత ప్రవేశించడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యాంపస్‌లోని రెసిడెన్షియల్ ఏరియాలో చిరుత సంచరిస్తున్నట్లు ఇప్పటికే ఫిర్యాదు ఉన్నది. హాస్టల్ మెట్ల వద్ద ఉన్న ఓ కుక్కను చిరుత తన నోటితో పట్టి చంపేసింది. చాలా నెమ్మదిగా వాకింగ్ చేసుకుంటూ వచ్చిన ఆ చిరుత సడెన్‌గా కుక్కపై దాడి చేసింది. చనిపోయిన కుక్క బాడీతోనే ఆ చిరుత అదృశ్యమైంది. క్యాంపస్ విద్యార్థులు, సిబ్బంది, స్థానికులు ఆ వీడియో చూసి భయాందోళనలకు గురవుతున్నారు. రాత్రి పూట సంచారం ఇబ్బందిగా మారినట్లు ఫిర్యాదు చేశారు. పోవాయ్ సమీపంలో అటవీ ప్రదేశం ఉన్న కారణంగా.. అక్కడ పలు సందర్భాల్లో చిరుతలు కనిపించాయి.
A Leopard Entered IIT Bombay Campus at Staff Hostel and Viciously Attacked a Dog Caught on CCTV Camera😳 pic.twitter.com/bsfcUvBTXS
— Ghar Ke Kalesh (@gharkekalesh) June 19, 2026