సోలార్ సైక్లింగ్ ట్రాక్ రెడీ
దేశంలో మొట్టమొదటి సోలార్ రూప్‌టాప్ సైక్లింగ్ ట్రాక్ ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్) వెంట రెడీ అవుతున్నది. రెండు మార్గాల్లో 23 కిలోమీటర్ల పొడవున ఈ ట్రాక్‌ను తెలంగాణ ప్రభుత్వం సిద్ధచేస్తున్నది. ఆగస్టు 15న ట్రాక్‌ను ప్రారంభించేందుకు అవసరమైన పనుల్లో నిమగ్నమైంది.
- దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు
- ఓఆర్ఆర్పై ఆగస్టు 15న ప్రారంభం
- రెండు మార్గాలు.. 23 కిలోమీటర్లు
- సంస్థల ఎంపికకు 13న ప్రీ బిడ్ భేటీ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ): దేశంలో మొట్టమొదటి సోలార్ రూప్‌టాప్ సైక్లింగ్ ట్రాక్ ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్) వెంట రెడీ అవుతున్నది. రెండు మార్గాల్లో 23 కిలోమీటర్ల పొడవున ఈ ట్రాక్‌ను తెలంగాణ ప్రభుత్వం సిద్ధచేస్తున్నది. ఆగస్టు 15న ట్రాక్‌ను ప్రారంభించేందుకు అవసరమైన పనుల్లో నిమగ్నమైంది. ఐటీ కారిడార్‌లోని నానక్‌రాంగూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ) వరకు ఎనిమిది కిలోమీటర్లు, నార్సింగి నుంచి కొంపల్లి వరకు 15 కిలోమీటర్ల మేర ట్రాన్‌కు ఏర్పాటు చేస్తున్నది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) విభాగమైన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ 4.5 మీటర్ల వెడల్పులో మూడు లేన్లుగా సైక్లింగ్ ట్రాక్‌ను నిర్మిస్తున్నది. రోడ్డుమార్గంతోపాటు ఫెన్సింగ్‌తో కూడిన నిర్మాణం పూర్తయింది. సోలార్ ప్యానల్స్‌ను బిగించాల్సి ఉన్నది.
25న టెండర్ల ప్రక్రియ
సైకిల్ ట్రాక్‌పై పరుగులు పెట్టేందుకు సైకిళ్లను సైతం అందుబాటులో ఉంచేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. రెండు మార్గాల్లో నగర వాసులకు సైకిళ్లను కిరాయికి ఇచ్చేందుకు, వాటి నిర్వహణ కార్యకలాపాలు చేపట్టేందుకు ఏజెన్సీలను ఎంపికచేసే పనుల్లో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఈ నెలాఖరు వరకు సైకిళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధంచేశామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ట్రాక్‌పైకి సొంత, కిరా యి సైకిళ్లు తిరిగేలా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కార్లలో వచ్చే వారికి సైతం సైకిళ్లను కిరాయికి ఇచ్చేలా ప్రైవేటు సంస్థలను ఎంపిక చేస్తున్నామని వెల్లడించారు. ఈ నెల 13న దీని కి ప్రీ బిడ్ సమావేశాన్ని నానక్‌రాంగూడలో నిర్వహిస్తున్నామని, ఈ నెల 25న టెండర్లను తెరిచి, అర్హులైన వారిని ఎంపిక చేస్తామని అధికారులు వివరించారు. పార్కింగ్ స్థలాలు, నిఘా కెమెరాలు, సైకిల్ డాకింగ్, ఫుడ్‌కోర్టులు, తాగునీరు, విశ్రాంతి గదులు, ప్రాథమిక సైకిల్ రిపేర్ షాపులు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
ట్రాక్ మొత్తం పొడవు 23 కిలోమీటర్లు. నానక్‌రాంగూడ నుంచి పోలీస్ అకాడమీ వరకు నార్సింగి నుంచి కొంపల్లి వరకు మరో మార్గం 4.5 మీటర్ల వెడల్పుతో మూడు సైకిళ్ల లేన్లు రూప్‌టాప్‌పై 16 మెగావాట్ల సోలార్ పలకలు
సైకిల్ ట్రాక్‌కు రెండువైపులా గ్రీనరీ ఏర్పాటు 850 సైకిళ్ల పార్కింగ్‌కు స్థలం కేటాయింపు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

