షార్ట్ వేసుకున్న వ్యక్తిని.. ఎస్బీఐ బ్యాంకులోకి ప్రవేశం నిరాకరణ

కోల్‌కతా: షార్ట్ వేసుకొని వచ్చిన ఒక వ్యక్తిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్యాంకులోకి ప్రవేశానికి సిబ్బంది నిరాకరించారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఈ ఘటన జరిగింది. కోల్‌కతాకు చెందిన ఆశిష్ ఈ నెల 16న షార్ట్‌తో స్థానిక ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాడు. అయితే అక్కడి సిబ్బంది అతడ్ని లోనికి అనుమతించలేదు. ఒక నిర్దిష్ట స్థాయి మర్యాదను ఆశించిన బ్యాంకు సిబ్బంది.. పూర్తి ప్యాంటు ధరించి రావాలని చెప్పారు.
దీనిపై ఆశిష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎస్బీఎస్ అధికార ట్విట్టర్లో తన ఆక్రోశాన్ని వెళ్లగక్కాడు. ‘హే @TheOfficialSBI. ఈ రోజు మీ బ్రాంచ్‌లలో ఒకదానికి షార్ట్ వేసుకుని వెళ్లాను. కస్టమర్లు ‘మర్యాదను మెయింటెయిన్ చేయాలని’ బ్రాంచ్ ఆశిస్తున్నందున నేను ఫుల్ ప్యాంట్ ధరించి తిరిగి రావాలని అక్కడి సిబ్బంది చెప్పారు’ అని ట్వీట్ చేశాడు.
కస్టమర్ ఏమి ధరించవచ్చు, ఏమి ధరించకూడదు అనే దానిపై ఏదైనా అధికారిక విధానం ఉందా? అని ఆశిష్ ప్రశ్నించాడు. 2017లో పూణెలో కూడా ఇలాంటి ఘటన జరిగిందని గుర్తు చేశాడు. బెర్ముడా షార్ట్ ధరించిన వ్యక్తిని బ్యాంకులోకి ప్రవేశం నిరాకరించారని తెలిపాడు.
కాగా, వైరల్ అయిన ఆశిష్ ట్విట్టర్ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నంగా రియాక్ట్ అయ్యారు. చాలా మంది అతడినే తప్పుపట్టారు. మిగతా కస్టమర్లకు ఇబ్బంది కలుగకుండా బ్యాంకుల వంటి ప్రదేశాలకు ఫార్మల్ డ్రెస్‌లోనే వెళ్లాలని సూచించారు. అలా వెళ్లడం ఇష్టం లేకపోతే బ్యాంక్ ఎకౌంట్‌ను మూసివేయాలని ఒకరు సలహా ఇచ్చారు.
Hey @TheOfficialSBI went to one of your branch today wearing shorts, was told that I need to come back wearing full pants as the branch expects customers to "maintain decency"
— Jasodhaben ka bhai (@ashishjee008) November 16, 2021
Is there some sort of an official policy on what a customer can wear and cannot wear?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

