మళ్లీ రైతాంగ ఉద్యమం.. కేంద్రం మోసంపై ఆగ్రహం
కేంద్రంలోని బీజేపీ సర్కార్ మోసంపై రైతన్నలు రగిలిపోతున్నారు. వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన మహోద్యమ విరమణ సమయంలో ఇచ్చిన హామీల అమలులో చేసిన ద్రోహంపై మండిపడుతున్నారు.
- తిరిగి పోరుబాటకు రైతన్న
- మార్చి 20న పార్లమెంటు వద్ద ‘కిసాన్ మహాపంచాయత్’
- ఢిల్లీకి వేలాది రైతులు: ఎస్కేఎం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: కేంద్రంలోని బీజేపీ సర్కార్ మోసంపై రైతన్నలు రగిలిపోతున్నారు. వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన మహోద్యమ విరమణ సమయంలో ఇచ్చిన హామీల అమలులో చేసిన ద్రోహంపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై మళ్లీ ఉద్యమానికి రైతాంగం సిద్ధమవుతున్నది. ఎంఎస్పీకి చట్టబద్ధత, విద్యుత్తు సవరణ బిల్లు ఉపసంహరణ, రుణమాఫీ వంటి డిమాండ్ల సాధన కోసం మార్చి 20 నుంచి ఆందోళనలను పునఃప్రారంభిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) వెల్లడించింది. ఇందులో భాగంగా మార్చి 20న పార్లమెంట్ ముందు కిసాన్ మహాపంచాయత్ నిర్వహిస్తామని ప్రకటించింది. గురువారం హర్యానాలోని కురుక్షేత్రలో ఎస్కేఎం నేతల సమావేశం అనంతరం రైతు నేత యుధ్వీర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. మార్చి 20న దేశం నలుమూలల నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీ చేరుకొంటారని తెలిపారు. తమ డిమాండ్లపై ప్రభుత్వ స్పందనకు అనుగుణంగా తదుపరి ఉద్యమ కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు. పంటల ఎంఎస్పీకి చట్టబద్ధత, విద్యుత్తు సవరణ బిల్లు-2022 ఉపసంహరణ, రైతాంగ ఉద్యమంలో మరణించిన అమరవీరుల కుటుంబాలకు పరిహారం, కేంద్ర మంత్రి అజయ్‌మిశ్రాని తొలగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
రైతు వ్యతిరేక బడ్జెట్..
ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ను రైతు వ్యతిరేక బడ్జెట్‌గా ఎస్కేఎం నేతలు ప్రకటించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ఈ బడ్జెట్ విఫలమైందని విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

