న్యూఢిల్లీ: లిథువేనియాకు చెందిన ఓ వ్యక్తి నెల రోజుల కింద మద్యం మానేశాడు. కానీ అప్పటి నుంచి మేకులు, స్క్రూలు, నట్లు ఇలా ఏ లోహం దొరికినా మింగడం మొదలు పెట్టాడు. ఇటీవల కడుపులో తీవ్రంగా నొప్పి రావడంతో వైద్యుల వద్దకు వెళ్లాడు. వైద్యులు శస్త్ర చికిత్స చేసి అతని కడుపులోంచి కిలోకు పైగా మేకులు, స్క్రూలను బయటకు తీశారు.