Ketan Agarwal | ‘కేతన్ ఉదంతం ఒక హెచ్చరిక’.. పురుషుల కోసం జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని ఎంపీ డిమాండ్
Ketan Agarwal | కేతన్ అగర్వాల్‌ను కాబోయే భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేసిన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ‘పురుషుల కోసం జాతీయ కమిషన్’ ఏర్పాటు చేయాలని ఒక ఎంపీ డిమాండ్ చేశారు. దీని కోసం గత పార్లమెంట్ సమావేశంలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లును ఆయన ప్రస్తావించారు.
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని పూణేకు చెందిన 26 ఏళ్ల కేతన్ అగర్వాల్‌ను కాబోయే భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేసిన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ‘పురుషుల కోసం జాతీయ కమిషన్’ ఏర్పాటు చేయాలని ఒక ఎంపీ డిమాండ్ చేశారు. దీని కోసం గత పార్లమెంట్ సమావేశంలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లును ఆయన ప్రస్తావించారు. ఆప్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై ఇటీవల బీజేపీలో చేరిన పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడైన అశోక్ కుమార్ మిట్టల్, కేతన్ అగర్వాల్ హత్య కేసుపై శనివారం స్పందించారు. ఈ ఉదంతం అత్యంత ఆందోళనకరమని అభిప్రాయపడ్డారు.
కాగా, ‘పురుషుల కోసం జాతీయ కమిషన్’ ఏర్పాటు చేయాలన్న తన పిలుపును ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్ మరోసారి పునరుద్ఘాటించారు. ‘పూణేకు చెందిన కేతన్ అగర్వాల్ కేసు తీవ్రంగా కలవరపరిచేది. కేతన్, అతడి కుటుంబం నిష్పాక్షికమైన, సమగ్రమైన, న్యాయమైన విచారణ, అన్నింటికంటే ముఖ్యంగా న్యాయానికి అర్హులు. నేను పార్లమెంటులో పురుషుల జాతీయ కమిషన్ బిల్లును ప్రవేశపెట్టాను. ప్రతి బాధితులకు న్యాయం, మద్దతు, చట్టం ముందు సమాన రక్షణ లభించాలి. పురుషులు కూడా బాధితులు కాగలరని కేతన్ కేసు గుర్తు చేస్తుంది. మగవారికి కూడా సంస్థాగత మద్దతు, చట్టపరమైన రక్షణ, వారి గొంతు వినిపించే ఒక వేదిక అవసరం. లింగ భేదం లేకుండా న్యాయం అందరికీ సమానంగా జరుగాలి’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
అలాగే ‘జాతీయ మహిళా కమిషన్’ తరహాలో పురుషులకు కూడా ఒక జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ గత ఏడాది డిసెంబర్లో రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుకు సంబంధించిన వీడియోను ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్ షేర్ చేశారు. కేతన్ హత్య నేపథ్యంలో ‘పురుషుల కోసం జాతీయ కమిషన్’ ఏర్పాటు చేయాలన్న ఈ ప్రతిపాదిత ప్రైవేట్ బిల్లు ఇప్పుడు చర్చనీయంశమైంది.
అయితే పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఇలాంటి ప్రైవేట్ బిల్లులు కనీసం ఓటింగ్ దశకు కూడా చేరవు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇలాంటి 14 బిల్లులు మాత్రమే చట్టంగా మారాయి, 1970 నుంచి పార్లమెంట్ ఉభయ సభల్లో ఏ ఒక్క ప్రైవేట్ బిల్లు ఆమోదం పొందలేదు.
Pune Ketan Agarwal case is deeply disturbing. Ketan and his family deserve a fair, thorough, and impartial investigation, and above all, justice.
I introduced the National Commission for Men Bill in Parliament. Every victim deserves justice, support, and equal protection under… pic.twitter.com/M6ENpG1T7F
— Ashok Kumar Mittal (@DrAshokKMittal) July 3, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

