కేరళలో రికార్డుస్థాయిలో 41,953 కరోనా కేసులు

తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. బుధవారం రికార్డుస్థాయిలో 41,953 కరోనా కేసులు, 58 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు దాటగా మొత్తం మరణాల సంఖ్య 5,565కు చేరింది. ఇప్పటి వరకు 13,62,363 మంది కరోనా నుంచి కోలుకున్నారని, ప్రస్తుతం 3,75,658 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
మరోవైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేరళ సీఎం పినరయి విజయన్ ప్రధాని మోదీకి బుధవారం లేఖ రాశారు. వెయ్యి టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, 50 లక్షల డోసుల కోవిషీల్డ్, 25 లక్షల కోవాగ్జిన్ డోసులను సరఫరా చేయాలని కోరారు. కరోనా కేసులపరంగా దేశంలోనే అత్యధిక క్రియాశీలకంగా కేరళ ఉన్నదని, వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఆక్సిజన్ ప్లాంట్లు, ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్స్, వెంటిలేటర్స్‌ను అందజేయాలని అభ్యర్థించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

