కేరళలో తగ్గిన కరోనా కేసులు

తిరువనంతపురం: కేరళలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా 30 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్నాయి. మొహర్రం, ఓనమ్, రక్షాబంధన్ వంటి వరుస పండుగ సెలవుల నేపథ్యంలో కరోనా కేసులు మరోసారి రికార్డు స్థాయికి పెరిగాయి. అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 19,688 కరోనా కేసులు, 135 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 42,27,526కు, మొత్తం మరణాల సంఖ్య 21,631కు పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో 28,561 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 39,66,557కు చేరుకున్నదని, ప్రస్తుతం రాష్ట్రంలో 2,38,782 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా హాట్స్పాట్గా కేరళ కొనసాగుతున్నది. ఆ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 16.71 శాతం ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

