Police Face Dog Threat | ఖాకీ డ్రెస్‌లో ఉన్న వారిని కరిచేలా కుక్కలకు ట్రైనింగ్.. దాడి నుంచి తప్పించుకున్న పోలీసులు
Police Face Dog Threat | ఖాకీ డ్రెస్‌లో ఉన్న వారిని కరిచేలా కుక్కలకు ఒక వ్యక్తి శిక్షణ ఇచ్చాడు. (Police Face Dog Threat) సోదాల కోసం అతడి ఇంటికి వెళ్లిన పోలీసులపై ఆ కుక్కలు దాడిచేయబోగా వారు తృటిలో తప్పించుకున్నారు. దీంతో డ్రగ్స్ డీలర్‌గా అనుమానిస్తున్న ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు.
తిరువనంతపురం: ఖాకీ డ్రెస్‌లో ఉన్న వారిని కరిచేలా కుక్కలకు ఒక వ్యక్తి శిక్షణ ఇచ్చాడు. (Police Face Dog Threat) సోదాల కోసం అతడి ఇంటికి వెళ్లిన పోలీసులపై ఆ కుక్కలు దాడిచేయబోగా వారు తృటిలో తప్పించుకున్నారు. దీంతో డ్రగ్స్ డీలర్‌గా అనుమానిస్తున్న ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. దర్యాప్తులో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. కేరళలోని కొట్టాయంలో ఈ సంఘటన జరిగింది. మాదకద్రవ్యాల వ్యాపారిగా అనుమానించిన వ్యక్తి ఇంట్లో సోదాల కోసం యాంటీ నార్కోటిక్ స్క్వాడ్, స్థానిక పోలీసులు కలిసి ఆదివారం రాత్రి రైడ్ చేశారు. ఈ సందర్భంగా అతడి ఇంట్లో ఉన్న సుమారు 13 కుక్కలు పోలీసులపై దాడి చేయబోగా వారు తృటిలో తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, పోలీసులు అనంతరం ఆ కుక్కలను అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి ఇంట్లో తనిఖీ చేశారు. 17 కేజీలకుపైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కొట్టాయం ఎస్పీ కార్తీక్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఆ వ్యక్తి ఇంట్లో అన్ని కుక్కలు ఉంటాయని తాము ఊహించలేదని తెలిపారు. ఖాకీ డ్రెస్‌లో ఉన్న వారిని చూసిన వెంటనే దాడి చేసి కరిచేలా ఆ కుక్కలకు అతడు ట్రైనింగ్ ఇచ్చినట్లు చెప్పారు. రిటైర్డ్ బీఎస్ఎఫ్ అధికారి ద్వారా డాగ్ ట్రైనింగ్‌లో అతడు శిక్షణ పొందినట్లు వివరించారు. డాగ్ ట్రైనింగ్ మాటున డ్రగ్స్ డీలింగ్ చేస్తున్నాడని ఆరోపించారు.
మరోవైపు అద్దె ఇంట్లో ఉంటున్న ఆ వ్యక్తి డాగ్ ట్రైనర్‌గా స్థానికులకు తెలుసని ఎస్పీ కార్తీక్ తెలిపారు. ఈ నేపథ్యంలో కొందరు బయట ప్రాంతాలకు వెళ్లినప్పుడు రోజుకు వెయ్యి చొప్పున చెల్లించి తమ పెంపుడు కుక్కలను అతడికి అప్పగించేవారని చెప్పారు. ప్రస్తుతం ఆ ఇంటి వద్ద 13 జాతి కుక్కలు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. వాటి యజమానులను గుర్తించి అప్పగిస్తామని చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అలాగే డ్రగ్స్ డీలింగ్‌లో ఇతర వ్యక్తుల ప్రమేయం ఉన్నదా అన్న దానిపైనా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

