ఇస్రోకు గగన్‌యాన్ క్రూ మాడ్యూల్ స్ట్రక్చర్ అందజేత
అంతరిక్ష ప్రయోగాల్లో అద్భుత విజయాలతో దూసుకెళ్తున్న భారత్.. త్వరలో తన తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర (గగన్‌యాన్)ను చేపట్టేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నది.
చెన్నై, అక్టోబర్ 8: అంతరిక్ష ప్రయోగాల్లో అద్భుత విజయాలతో దూసుకెళ్తున్న భారత్.. త్వరలో తన తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర (గగన్‌యాన్)ను చేపట్టేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నది. ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రయోగానికి అవసరమైన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్-క్రూ మాడ్యూల్ (ఐఏడీటీ-సీఎం) స్ట్రక్చర్‌ను ఇటీవల ఇస్రోకు అందజేసినట్టు చెన్నైకి చెందిన కేసీపీ లిమిటెడ్ సంస్థ ఆదివారం వెల్లడించింది. సాంకేతిక సన్నద్ధతను పరీక్షించుకునేందుకు 2 ఐఏడీటీ క్రూ మాడ్యూల్ స్ట్రక్చర్లను రూపొందించే బాధ్యతను కేసీపీకి ఇస్రో అప్పగించింది.
వీటిలో 3,120 కిలోల బరువైన తొలి ఐఏడీటీ-సీఎం 3.1 మీటర్ల వెడల్పు, 2.6 మీటర్ల పొడవు ఉంటుంది. అల్యూమినియంతో తయారైన ఈ స్ట్రక్చర్‌లో పారాచ్యూట్ సిస్టమ్, పైరోస్, ఏవియానిక్స్, బొయాన్సీ ఆగ్మెంటేషన్ సిస్టమ్ లాంటి ప్రధాన ఉప వ్యవస్థలతోపాటు వివిధ రకాలైన 100కుపైగా భాగాలు ఉంటాయి. గగన్‌యాన్‌లో భాగంగా ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులను క్రూ మాడ్యూల్ ద్వారా భూమికి 400 కిలోమీటర్ల ఎగువన ఉండే కక్ష్యలోకి తీసుకెళ్లి 3 రోజుల తర్వాత సురక్షితంగా తిరిగి సముద్ర జలాల్లో దింపుతారు.
కేసీపీ సంస్థ రూపొందించిన ఐఏడీటీ-సీఎం గగన్‌యాన్‌లో ఉపయోగించే వాస్తవ మాడ్యూల్ ఆకారాన్ని, పరిమాణాన్ని పోలి ఉంటుంది. గగన్‌యాన్‌కు ముందు డిసిలరేషన్ సిస్టమ్ (పారాచ్యూట్, పైరో) పనితీరును ధ్రువీకరించుకునేందుకు భారత వైమానికదళ హెలికాప్టర్ ద్వారా ఐఏడీటీ-సీఎంను దాదాపు 4 కి.మీ. ఎత్తు వరకు తీసుకెళ్లి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ నిర్వహిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhishek Banerjee: బీజేపీ గూండాలు ఇంటిపై దాడి చేశారు.. వీడియో షేర్ చేసిన టీఎంసీ ఎంపీ అభిషేక్
Ramayana | ‘రామాయణం’లో జటాయువు ఎపిసోడ్‌కు అదిరిపోయే స్పందన.. ఆ పాత్రతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న దిల్‌రాజు?
IND vs NZ 2nd ODI | భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్.. 134 పరుగులకే ఆలౌట్!
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

