Kartarpur Corridor | ఇండో-పాక్ సరిహద్దుల్లో తగ్గిన వరదలు.. కర్తార్‌పూర్ కారిడార్ యాత్ర పునఃప్రారంభం
కర్తార్‌పూర్ కారిడార్ (Kartarpur Corridor) యాత్ర నేటి నుంచి మళ్లీ ప్రారంభమం కానుంది. భారీ వర్షాల కారణంగా రావి నదిలో (Ravi river) నీటిమట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో వరదలు (Floods) పోటెత్తాయి.
న్యూఢిల్లీ: కర్తార్‌పూర్ కారిడార్ (Kartarpur Corridor) యాత్ర నేటి నుంచి మళ్లీ ప్రారంభమం కానుంది. భారీ వర్షాల కారణంగా రావి నదిలో (Ravi river) నీటిమట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో వరదలు (Floods) పోటెత్తాయి. ఈ నేపథ్యంలో యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే తాజాగా ఇరు దేశాల సరిహద్దుల్లో వరదలు తగ్గుముఖం పట్టడంతో అధికారులు యాత్రను నేటి నుంచి పునఃప్రారంభించనున్నారు. దీంతో మంగళవారం 132 మంది సిక్కు భక్తులు కర్తార్ పూర్ కారిడార్ యాత్రకు పేర్లు నమోదు చేసుకున్నారని గురుదాస్‌పూర్ డీసీపీ తెలిపారు.
కాగా, పాకిస్థాన్‌లోని (Pakistan) కర్తార్‌పూర్‌లో (Kartarpur) ఉన్న గురుద్వారా దర్బార్ సాహిబ్ (Gurudwara darbar Sahib) సిక్కులకు పవిత్ర పుణ్యక్షేత్రం. పాక్ పంజాబ్ ప్రావిన్స్‌లోని రావి నది ఒడ్డున ఉన్న ఈ గురుద్వారా భారత సరిహద్దు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. దీనిని భారత్‌లోని గురుదాస్‌పూర్ (Gurdaspur) జిల్లాలోని గురుద్వారా డేరా బాబా నానక్‌తో (Gurudwara Dera Baba Nanak) కలుపుతూ కర్తార్‌పూర్ కారిడార్ నిర్మించారు. యాత్రికులు ఎలాంటి ఆంక్షలు లేకుండా వీటిని సందర్శించడానికి భారత్-పాక్ ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నారు. దీంతో 2019 నవంబర్ 9న కర్తార్‌పూర్ కారిడార్ యాత్ర ప్రారంభమైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

