Karnataka HC | దునియా విజయ్ దంపతులకు విడాకులు మంజూరు.. భార్యకు రూ.2 కోట్ల భరణం చెల్లించాలిన హైకోర్టు ఆదేశం
Karnataka HC | కన్నడ చిత్ర పరిశ్రమ (Kannada Film Industry) కు చెందిన ప్రముఖ నటుడు (Noted Actor), దర్శకుడు, నిర్మాత దునియా విజయ్ (Dunia Vijay) వైవాహిక జీవితానికి తెరపడింది. ఆయన భార్య నాగరత్న (Nagaratna) తో విడాకులను మంజూరు చేస్తూ కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) గురువారం తీర్పు వెలువరించింది.
Karnataka HC : కన్నడ చిత్ర పరిశ్రమ (Kannada Film Industry) కు చెందిన ప్రముఖ నటుడు (Noted Actor), దర్శకుడు, నిర్మాత దునియా విజయ్ (Dunia Vijay) వైవాహిక జీవితానికి తెరపడింది. ఆయన భార్య నాగరత్న (Nagaratna) తో విడాకులను మంజూరు చేస్తూ కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) గురువారం తీర్పు వెలువరించింది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న వారి వైవాహిక వివాదానికి ముగింపు పలుకుతూ.. నాగరత్నకు ఏకమొత్తం భరణంగా రూ.2 కోట్లు చెల్లించాలని విజయ్ను ఆదేశించింది.
ఈ మొత్తాన్ని రెండు నెలల్లోగా చెల్లించాలని, గడువులోగా చెల్లించని పక్షంలో ఏటా 6 శాతం వడ్డీ వర్తిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ డీకే సింగ్, జస్టిస్ హెచ్ శాంతి భూషణ్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. నాగరత్న ప్రస్తుత పరిస్థితులు, ఈ దంపతులకు ఉన్న ముగ్గురు పిల్లల భవిష్యత్తు, చిత్ర పరిశ్రమలో విజయ్ ఆర్థిక స్థితిగతులు, హోదాను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నది. గతంలో విడాకుల కోసం విజయ్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా.. ఆయన చూపిన క్రూరత్వ కారణాలను న్యాయస్థానం అంగీకరించలేదు. దాంతో ఆయన విడాకుల పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
అయితే వారి మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినడం, తిరిగి కలిసి జీవించేందుకు విజయ్ సుముఖంగా లేకపోవడంతో హైకోర్టు ఈ కేసును విచారించి విడాకులను మంజూరు చేసింది. తన తల్లిదండ్రులను నాగరత్న సరిగ్గా చూసుకోలేదని విజయ్ తన పిటిషన్లో ఆరోపించారు. ఈ సందర్భంగా ధర్మాసనం ఒక కీలక వ్యాఖ్య చేసింది. తెరపై మంచి నడవడిక, విలువలను ప్రదర్శించే ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు తమ వ్యక్తిగత జీవితాల్లోనూ వాటిని ప్రతిబింబించాలని సూచించింది. ఈ తీర్పును సవాలు చేసేందుకు ఇరు పక్షాలకు అవకాశం ఉందని తెలిపింది.
కాగా నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రంలో దునియా విజయ్ ప్రతినాయకుడిగా నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు. 2007లో వచ్చిన ‘దునియా’ చిత్రంతో ఆయన కన్నడలో స్టార్డమ్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో ఆయన కుమార్తె మోనిషా విజయ్ కుమార్ కథానాయికగా ‘సిటీ లైట్స్’ అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

