బెంగళూరు: పోలీస్ స్టేషన్లో విధుల్లో ఉన్న పోలీసులు నిద్రించారు. బాలికపై లైంగిక వేధింపుల కేసు నిందితుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఇది బయటపడింది. దీంతో నిందితుడ్ని పట్టుకుని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెతుకుతున్నారు. (Cops Sleep, Accused Flees) కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బాలికపై లైంగిక దాడి కేసులో మంచునాథ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టంతో సహా పలు సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్‌లోని లాకప్‌లో నిందితుడిని ఉంచారు.
కాగా, రాత్రి విధుల్లో ఉన్న పోలీసులు నిద్రపోయారు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో నిందితుడు మంజునాథ్ లాకప్ నుంచి తప్పించుకున్నాడు. పోలీస్ స్టేషన్ భవనం రెండవ అంతస్తు నుంచి కిందకు దూకి అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఇది తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. నిందితుడు మంజునాథ్ ఆచూకీ కనుగొని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కర్ణాటకతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో కూడా పోలీస్ బృందాలు వెతుకుతున్నాయి. నిందితుడు తప్పించుకున్న సంఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలకు సిద్ధమయ్యారు.
Kidnap Accused escaped from Police Station | ಅಫಜಲಪುರ ಠಾಣೆಯ ಪೊಲೀಸರಿಗೆ
ಚಳ್ಳೆಹಣ್ಣು ತಿನ್ನಿಸಿದ ಆರೋಪಿ#Kalaburagi #Afzalpur #AccusedEscape #KalaburagiPolice ##KalaburagiNews pic.twitter.com/4kPnU2nwFz— Sanjevani News (@sanjevaniNews) July 3, 2026