నిరసన హక్కు నేరమైపోయింది
దేశంలో నిరసన తెలపడం నేరమైపోయిందని.. నిరసన తెలిపే ప్రజల హక్కును సుప్రీంకోర్టు రక్షిస్తుందన్న నమ్మకం తనకు ఉన్నదని రాజ్యసభ స్వతంత్ర ఎంపీ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు.
- ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారు
- కేంద్రం తీరును ఖండించిన ఎంపీ కపిల్ సిబల్
న్యూఢిల్లీ: దేశంలో నిరసన తెలపడం నేరమైపోయిందని.. నిరసన తెలిపే ప్రజల హక్కును సుప్రీంకోర్టు రక్షిస్తుందన్న నమ్మకం తనకు ఉన్నదని రాజ్యసభ స్వతంత్ర ఎంపీ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ను నిరసన స్థలిగా కేంద్రం డీ నోటిఫై చేయడంపై ఆయన ఈ విధంగా స్పందించారు. శనివారం ఆయన ఒక ఆన్లైన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తీవ్ర నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, ప్రభుత్వ పెట్టుబడులు తగ్గడం వల్ల ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై విశ్వాసాన్ని కోల్పోయారని.. ఈ సర్కార్ ఎంత త్వరగా అధికారం నుంచి దిగిపోతే, దేశానికి అంత మంచిదని వ్యాఖ్యానించారు. యువత చేపట్టిన నిరసనల వల్ల ప్రభుత్వానికి ఏం ప్రమాదం పొంచి ఉందని ప్రశ్నించారు. ఎన్నికల వ్యవస్థలు కేంద్రీకృతం కావడం వల్ల 2024లో ఓటర్ల జాబితాను తారుమారు చేశారని ఆయన ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

