Kangana Ranaut: బీఫ్, రెడ్‌మీట్ తినను: కంగనా రనౌత్
Kangana Ranaut: బీఫ్ కానీ రెడ్ మీట్ కానీ తినను అని నటి కంగనా రనౌత్ పేర్కొన్నది. కంగనా ఆవు మాంసాన్ని తిన్నట్లు కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ ఆరోపించారు. ఆ ఆరోపణలను ఆమె ఖండించారు.
మండీ: బీఫ్ కానీ రెడ్ మీట్ కానీ తినను అని నటి కంగనా రనౌత్(Kangana Ranaut) పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మండీ నుంచి ఆమె పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కంగనా రనౌత్ ఆవు మాంసాన్ని తిన్నట్లు కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ ఆరోపించారు. బీఫ్‌ను ఇష్టపడి తిన్నట్లు కంగనా రనౌతే చెప్పినట్లు కాంగ్రెస్ నేత గుర్తు చేశారు. మహారాష్ట్రలో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీన్ని కంగనా రనౌత్ ఖండించారు. బీఫ్ లేదా రెడ్ మీట్ తినను అని, చాలా సిగ్గు చేటు విషయమని, తన గురించి చెడుగా రూమర్స్ వ్యాప్తి చేస్తున్నట్లు కంగనా పేర్కొన్నారు. గత కొన్ని దశాబ్ధాల నుంచి యోగా, ఆయుర్వేద జీవితం గురించి ప్రచారం చేస్తున్నానని, తన ఇమేజ్ను దెబ్బతీసేందుకు కొందరు ఆరోపణలు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. తన ప్రజలకు తానేంటో తెలుసు అని, తానొక గర్వించదగ్గ హిందువును అన్న విషయం తెలుసు అని, ఈ విషయంలో ఎవర్నీ తప్పుపట్టలేరని ఆమె తన ట్వీట్లో తెలిపారు.
I don’t consume beef or any other kind of red meat, it is shameful that completely baseless rumours are being spread about me, I have been advocating and promoting yogic and Ayurvedic way of life for decades now such tactics won’t work to tarnish my image. My people know me and…
— Kangana Ranaut (Modi Ka Parivar) (@KanganaTeam) April 8, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

