సీజేఐగా నేడు సంజీవ్ ఖన్నా ప్రమాణం
సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయం 10 గంటలకు ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. జస్టిస్ ఖన్నా 2025 మే 13 వరకు సీజేఐగా కొనసాగుతారు. ఎన్నికల బాండ్లను రద్దు చేయడం, ఈవీఎంలు విశ్వసనీయమైనవని ప్రకటించడం, 370 అధికరణ రద్దును సమర్థించడం, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం లాంటి కీలక తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో జస్టిస్ ఖన్నా భాగస్వామిగా ఉన్నారు.
- వచ్చే ఏడాది మే 13 వరకు బాధ్యతలు
- జస్టిస్ చంద్రచూడ్ పదవీ విరమణ
న్యూఢిల్లీ, నవంబర్ 10: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయం 10 గంటలకు ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. జస్టిస్ ఖన్నా 2025 మే 13 వరకు సీజేఐగా కొనసాగుతారు. ఎన్నికల బాండ్లను రద్దు చేయడం, ఈవీఎంలు విశ్వసనీయమైనవని ప్రకటించడం, 370 అధికరణ రద్దును సమర్థించడం, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం లాంటి కీలక తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో జస్టిస్ ఖన్నా భాగస్వామిగా ఉన్నారు. ఆయన 2019 జనవరి 18 నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేస్తున్నారు.
చంద్రచూడ్ తనదైన ముద్ర
రెండేండ్ల పాటు సీజీఐగా పనిచేసిన జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ కాలం ఆదివారంతో ముగిసింది. అయోధ్య జన్మభూమి వివాదం, ఆర్టికల్ 370 రద్దు, స్వలింగ సంపర్కాన్ని నేరరహితం చేయడం వంటి తీర్పులలో భాగస్వామి కావడమే కాక, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 38 రాజ్యాంగ ధర్మాసనాలలో ప్రాతినిధ్యం వహించారు. సుప్రీంకోర్టులో 500కు పైగా తీర్పులు ఇచ్చారు. ఒక్క తీర్పులలోనే కాక, న్యాయ విభాగంలో పలు సంస్కరణలు ప్రవేశపెట్టి తనదైన ముద్ర వేశారు. ఇప్పటివరకు కళ్లకు గంతలతో ఉన్న న్యాయదేవత స్థానంలో ఒక చేతిలో త్రాసు, మరో చేతిలో రాజ్యాంగం చేతబట్టిన కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

