Hemant Soren | జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్.. ప్రమాణం చేయించిన గవర్నర్
Hemant Soren | జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ సీవీ రాధాకృష్ణన్ సోరెన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. అంతకు ముందు ఆయనను కూటమి నేతలు లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఎన్నుకున్నారు.
Hemanth Soren | జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ సీవీ రాధాకృష్ణన్ సోరెన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. అంతకు ముందు ఆయనను కూటమి నేతలు లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఎన్నుకున్నారు. చంపై సోరెన్ బుధవారం సీఎం పదవికి రాజీనామా చేశారు. గవర్నర్‌ను కలిసి ఆయనకు రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఆ తర్వాత హేమంత్ సోరెన్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. సోరెన్ సీఎంగా ప్రమాణం ప్రమాణం చేయడం ఇది మూడోసారి. కేవలం సోరెన్ మాత్రమే ప్రమాణస్వీకారం చేయగా.. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగనున్నది.
ఆ తర్వాత మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. సీఎం పదవి నుంచి వైదొలిగిన చంపై సోరెన్ ఇకపై కోఆర్డినేషన్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించారనున్నారు. నిన్న జరిగిన జార్ఖండ్ ముక్తి మోర్చా సమావేశంలో శాసనసభాపక్ష నేతగా హేమంత్ సోరెన్‌ను నియమించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ జార్ఖండ్ ఇన్చార్జి గులాం అహ్మద్ మీర్‌తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్, హేమంత్ సోరెన్ సోదరుడు బసంత్ సోరెట్, భార్య కల్పనా సోరెన్ సమావేశానికి హాజరయ్యారు. భూ కుంభకోణం కేసులో దాదాపు ఐదునెలల తర్వాత మాజీ సీఎం హేమంత్ సోరెన్ జూన్ 28న జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈడీ కేసులో ఆయన జనవరి 31న అరెస్ట్ కాగా.. హేమంత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

