Terrorists arrest | భారత్‌లోకి అక్రమంగా చొరబడే యత్నం.. సరిహద్దుల్లో ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్
Terrorists arrest | పాకిస్థాన్ నుంచి జమ్ముకశ్మీర్‌లోకి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంటకు జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్ గుండా కొందరు ఉగ్రవాదులు వాస్తవాధీన రేఖ దాటి భారత్‌లో చొరబడేందుకు ప్రయత్నించారు.
జమ్ముకశ్మీర్: పాకిస్థాన్ నుంచి జమ్ముకశ్మీర్‌లోకి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంటకు జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్ గుండా కొందరు ఉగ్రవాదులు వాస్తవాధీన రేఖ దాటి భారత్‌లో చొరబడేందుకు ప్రయత్నించారు. అర్ధరాత్రి వేళ భారీగా వర్షం పడుతున్న సమయాన్ని వారు చొరబాటుకు ఎంచుకున్నారు.
అయితే, జమ్ముకశ్మీర్ పోలీసులతో కలిసి సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న భారత సైన్యం ఉగ్రవాదుల చొరబాటును గమనించి కాల్పులు జరిపింది. ప్రతిగా ఉగ్రవాదులు కూడా ఎదురుకాల్పులు జరిపారు. కాల్పులు ఆగిపోయిన అనంతరం భద్రతా బలగాలు ఘటనా ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా ముగ్గురు ఉగ్రవాదులు గాయాలతో పడి ఉన్నారు.
ఆ ముగ్గురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది వారి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక మందుపాతరలకు ఉపయోగించే దాదాపు 10 కేజీల మందుగుండు సామాగ్రిని కూడా సీజ్ చేశారు. ఘటనా ప్రాంతంలో ఇంకా గాలింపు కొనసాగుతున్నది. కాగా, ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక జవాన్‌కు కూడా గాయాలయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

