న్యూఢిల్లీ: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని .. కొత్త లుక్‌లో ఓ ఫోటో రిలీజ్ చేశారు. తన ఇన్‌స్టాలో ఓ సెల్ఫీ ఫోటోను పోస్టు చేశారు. చాలా క్యూటీగా ఆ పిక్‌లో ఆమె కనిపిస్తున్నారు. అయితే భారతీయ వేషధారణ కూడా ఆమె లుక్‌లో ఉన్నది. జార్జియా మెలోని.. చెవి కమ్మలు వేసుకున్నది. భారతీయ స్త్రీలు ధరించే రీతిలో ఆమె ఆ చెవికమ్మల్లో కనిపించారు. వింటర్ ఔట్ఫిట్ డ్రెస్సింగ్ వేసుకున్న ఆమె .. బొగ్గు రంగు బ్లేజర్ ధరించింది. జుమ్కా పెట్టుకున్న మెలోనీ ఫోటోపై ఆన్లైన్లో కామెంట్లు జోరందుకుంటున్నాయి. తన ఫోటోతో పాటు ఓ స్ట్రాంగ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారామె. తమకు ఎవరూ రాజకీయ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వైర్లు, మాస్టర్లు లేరని, ఎవరి నుంచి తాము ఆదేశాలు తీసుకోబోమన్నారు. ఇటలీ ప్రయోజనమే తమ ముఖ్య ఉద్దేశమన్నారు. గర్వంగా ఆ మార్గంలో నడుస్తామన్నారు.