Israeli Air Force: ఆకాశంలోనే ఇంధనం నింపుకుని.. హిజ్బొల్లాపై భీకర దాడి.. వీడియో
Israeli Air Force : ఇజ్రాయిల్‌కు చెందిన ఎఫ్-35 ఫైటర్ జెట్స్.. హిజ్బొల్లాపై అటాక్‌లో పాల్గొన్నాయి. ఆ విమానాలకు ఆకాశంలోనే ఇంధనం నింపారు. దానికి చెందిన వీడియోను .. ఇజ్రాయిల్ రక్షణశాఖ రిలీజ్ చేసింది.
న్యూఢిల్లీ: లెబనాన్‌కు చెందిన హిజ్బొల్లాపై .. ఇజ్రాయిల్ వైమానిక దళం(Israeli Air Force) ఆదివారం భీకర దాడులు చేసింది. ఆ అటాక్ ఆపరేషన్‌కు చెందిన వీడియోను ఇజ్రాయిల్ రక్షణ దళం రిలీజ్ చేసింది. హిజ్బొల్లా ఉగ్రవాద సంస్థకు చెందిన కేంద్రాలపై దాడి చేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది. తెల్లవారుజామున 5 గంటలకు దాడి ప్రారంభమైంది. ఇజ్రాయిల్ ఉత్తర సరిహద్దు ప్రాంతంలో ఈ అటాక్ జరిగింది.
ఆ అటాక్‌కు చెందిన వీడియోను రిలీజ్ చేశారు. ఆకాశంలోనే యుద్ధ విమానాల్లో .. ఫుయల్ నింపుకున్న వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఎఫ్35 అదిర్ జెట్స్.. దాడి మధ్యలో ఇంధనం నింపుకున్నాయి. చాలా కచ్చితత్వంతో ఆ విమానాలను శత్రు టార్గెట్లను ధ్వంసం చేసిన దృశ్యాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి. ఆశ్చర్యకరమైన రీతిలో, చాలా భీకరంగా దాడి చేసినట్లు ప్రధాని బెంజిమన్ నెతన్యహూ తెలిపారు.
హిజ్బొల్లాకు చెందిన వేలాది షార్ట్ రేంజ్ రాకెట్లను తమ ఆపరేషన్ ద్వారా పేల్చివేసినట్లు నెతన్యహూ వెల్లడించారు. ఇజ్రాయిల్‌లోని గలిలీ ప్రాంతంలోని పౌరులను టార్గెట్ చేశారని, కానీ ఆ దాడిని తిప్పికొట్టినట్లు నెతన్యహూ పేర్కొన్నారు. సెంట్రల్ ఇజ్రాయిల్‌పై హిజ్బొల్లా వదలిన డ్రోన్లను ఐడీఎఫ్ దళాలు నిర్వీర్యం చేసినట్లు కూడా ఆయన వెల్లడించారు.
దక్షిణ లెబనాన్ ప్రాంతంలో వేలాది హిజ్బొల్లా మిస్సైళ్లను.. వందలాది యుద్ధ విమానాలు ధ్వంసం చేసిట్లు చెప్పారు. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం ఆ అటాక్ జరిగినట్లు నెతన్యహూ తెలిపారు. దాడుల నేపథ్యంలో ఇజ్రాయిల్ 48 గంటల ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రధాన విమనాశ్రయాన్ని తాత్కలికంగా మూసివేసింది. దీంతో అనేక విమానాలను రద్దు చేశారు. హిజ్బొల్లా తన దాడిలో భాగంగా సుమారు 300 ప్రొజెక్టైల్స్‌ను వాడినట్లు తెలుస్తోంది.
WATCH how the IAF acted precisely today to stop a large-scale terrorist attack from Hezbollah.
Our operation in Lebanon targeted the terrorist infrastructure Hezbollah planned to use against us, protecting Israeli families and homes. pic.twitter.com/2J3sqAnFWB
— Israel Defense Forces (@IDF) August 25, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

