అమ్మకానికి ప్రయాణికుల డాటా.. డాటా మానిటైజేషన్కు IRCTC ప్రణాళిక
ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, షేర్లు తెగనమ్ముతున్న కేంద్ర ప్రభుత్వం చివరకు ప్రయాణికుల డాటానూ అమ్మకానికి పెట్టింది.
- వెయ్యి కోట్ల ఆర్జనే లక్ష్యం
- కన్సల్టెంట్ కోసం టెండర్
- వ్యక్తిగత సమాచార గోప్యతపై ఆందోళనలు
న్యూఢిల్లీ, ఆగస్టు 19: ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, షేర్లు తెగనమ్ముతున్న కేంద్ర ప్రభుత్వం చివరకు ప్రయాణికుల డాటానూ అమ్మకానికి పెట్టింది.ఈ డాటాతో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) వ్యాపారం చేయాలని చూస్తున్నది. ప్రయాణికుల డిజిటల్ డాటాను మానిటైజ్ చేసి, దాదాపు రూ.వెయ్యి కోట్ల ఆదాయం ఆర్జించేలా లక్ష్యం పెట్టుకొన్నది. ఇప్పటికే ఇందుకు కన్సల్టెంట్ను నియమించుకొనేందుకు ఈ-టెండర్ను ఆహ్వానించింది. దేశంలోని రైల్వే టికెట్లను ఐఆర్సీటీసీనే 80 శాతం విక్రయిస్తున్నది. ఇలా రోజూ ప్రయాణికుల వ్యక్తిగత వివరాలు, లావాదేవీల వివరాలు ఐఆర్సీటీసీ వద్ద నిక్షిప్తమై ఉన్నాయి.
డాటాతో డబ్బెలా?
వినియోగదారుల అప్లికేషన్ల డాటాను మానిటైజ్ చేయాలనుకొంటున్నట్టు ఐఆర్సీటీసీ టెండర్ నోటీసులో పేర్కొన్నది. అంటే.. డాటాను ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని టూర్స్ అండ్ ట్రావెల్స్, హోటల్స్, ఫైనాన్సింగ్, ఇన్సూరెన్స్, వైద్య సంస్థలకు అమ్మేస్తుంది. ఉదాహరణకు ఓలా, ఉబెర్ వంటి సంస్థలకు డాటాను అందజేస్తే, ప్రయాణికులకు ఆయా సంస్థలు ఫోన్/మెసేజ్ ద్వారా సంప్రదించి తమ క్యాబ్ బుక్ చేసుకోవాలని కోరే అవకాశం ఉంటుంది. గమ్యస్థానం చేరాక ఏదేని హోటల్ యాజమాన్యం తమ హోటల్లో రూమ్ బుక్ చేసుకోవచ్చని సూచించే చాన్స్ ఉంటుంది.
వ్యక్తిగత డాటా గోప్యత మాటేమిటి?
ప్రయాణికుల డాటాతో వ్యాపారం చేయాలనుకొంటున్న ఐఆర్సీటీసీ నిర్ణయంపై పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది వ్యక్తిగత డాటా గోప్యతపై ప్రభావం చూపే అవకాశం ఉన్నదని అంటున్నారు. ఐటీ యాక్ట్-2000, పర్సనల్ డాటా ప్రొటెక్షన్ బిల్-2018, సుప్రీం కోర్టు ఆదేశాలకు లోబడి కన్సల్టెంట్లు పనిచేస్తాయా? అని ప్రశ్నిస్తున్నారు.
ప్రయాణికుల సమ్మతి తప్పనిసరి
భారత చట్టాల ప్రకారం దేశ ప్రజల వ్యక్తిగత వివరాలు వేరొకరితో పంచుకోవటానికి వీల్లేదు. ఒకవేళ ఐఆర్సీటీసీ ఆ వివరాలు పంచుకోవాలనుకొన్నా.. ప్రయాణికుల సమ్మతి తప్పనిసరి. అయి తే, ఈ నిర్ణయం ప్రాథమిక దశలోనే ఉన్నదని ఐఆర్సీటీసీ వివరణ ఇచ్చింది.
కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రం
ఏదైనా ప్రజా సమస్యపై వివరాలు అడిగితే నో డాటా అవేలబుల్ అని చెప్పే కేంద్రం.. దేశంలోని ప్రజల వ్యక్తిగత వివరాలను అమ్మకానికి పెట్టాలని చూస్తున్నదని కాంగ్రెస్ మండిపడింది.
ఐఆర్సీటీసీ వద్ద ఉన్న డాటా ఎంత?
సగటున ఒక రోజులో ఐఆర్సీటీసీ వెబ్సైట్ను దాదాపు 60 లక్షల మందికిపైగా లాగిన్ అవుతారు. రోజుకు 11 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవుతాయి. ఇదంతా ఒక్క రోజు మాటే. వారం, నెల, సంవత్సరం వారీగా పరిశీలిస్తే ఐఆర్సీటీసీ వద్ద ఎంత డాటా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

