Cuttack | దుర్గా మాత నిమజ్జనంలో ఉద్రిక్తత.. కటక్‌లో కర్ఫ్యూ, ఇంటర్నెట్ బంద్
ఒడిశాలోని కటక్‌లో (Cuttack) దుర్గా మాత నిమజ్జనం (Durga Puja idol immersion) సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య మొదలైన గొడవ తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. దీంతో 25 మంది గాయపడ్డారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో కటక్‌లో 36 గంటల పాటు కర్ఫ్యూ (Curfew) విధించిన పోలీసులు ఇంటర్నెట్ సేవలను (Internet) నిలిపివేశారు.
భువనేశ్వర్: ఒడిశాలోని కటక్‌లో (Cuttack) దుర్గా మాత నిమజ్జనం (Durga Puja idol immersion) సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య మొదలైన గొడవ తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. దీంతో 25 మంది గాయపడ్డారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో కటక్‌లో 36 గంటల పాటు కర్ఫ్యూ (Curfew) విధించిన పోలీసులు ఇంటర్నెట్ సేవలను (Internet) నిలిపివేశారు. శనివారం రాత్రి దుర్గామాత నిమజ్జన ఊరేగింపు కటక్ పట్టణంలోని దర్గా బజార్ (Dargah Bazaar) ప్రాంతం గుండా కఠాజోడి నది ఒడ్డుకు వెళుతున్నది. అయితే డీజీ విషయంలో నిమజ్జన ఊరేగింపును స్థానికుల్లో ఒక వర్గం అడ్డుకుంది. అర్ధరాత్రి వేళ డీజే కారణంగా పెద్ద శబ్దంతో పాటలు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం పెరిగి తీవ్రమైంది. ఊరేగింపులో ఉన్నవారు ప్రతిఘటించడంతో, ఘర్షణ కాస్తా పరస్పర దాడులకు దారితీసింది. దీంతో పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి. పెద్ద సంఖ్యలో వాహనాలకు నిప్పులు పెట్టారు. ఆ ఘర్షణలో కటక్ డీసీపీ రిషికేశ్ ఖిలారీతో సహా ఆరుగురు గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి, జనాలను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. అతి కష్టం మీద ఇరువర్గాలను తరిమికొట్టిన పోలీసులు.. నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. పట్టణంలో ఆంక్షలు విధించారు.

అయితే ఆంక్షలు ఉన్నప్పటికీ ఆదివారం సాయంత్రం విశ్వ హిందూ పరిషత్ (VHP) ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దీంతో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. నగరం తూర్పు శివార్లలోని బిద్యాధర్‌పూర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఘర్షణలు జరిగిన దర్గా బజార్ మీదుగా వెళ్లి, సీడీఏ ప్రాంతంలోని సెక్టార్ 11 వద్ద ముగిసింది. ర్యాలీ సందర్భంగా రూట్లో సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారని, గౌరీశంకర్ పార్క్ ప్రాంతంలో పలు దుకాణాలను ధ్వంసం చేయడమే కాకుండా, వాటికి నిప్పు పెట్టారని అధికారులు తెలిపారు.

శాంతికి భంగం కలిగించడానికి ప్రయత్నించిన గుంపులను చెదరగొట్టడానికి కమిషనరేట్ పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. పరిస్థితి విషమిస్తుండటంతో కటక్‌లోని పలు ప్రాంతాల్లో 36 గంటల పాటు కర్ఫ్యూ విధించారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులను అరికట్టడానికి ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. దర్గా బజార్, మంగళబాగ్, కంటోన్మెంట్, పూరిఘాట్, లాల్బాగ్, బిడానసి, మార్కట్ నగర్, సీడీఏ ఫేజ్-2, మాల్గోదామ్, బాదామ్బండి, జగత్పూర్, బయాలిస్ మౌజా, సాదర్, గౌరీశంకర్ పార్క్, బిద్యాధర్‌పూర్ వంటి ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక పోలీసులతోపాటు కేంద్ర సాయుధ బలగాలను భారీగా మోహరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

