Watch: ‘ఖల్నాయక్’ పాటను ప్లే చేసి.. నిందితులను పరేడ్ చేసిన పోలీసులు
Police parade accused | ముగ్గురు వ్యక్తులను కత్తితో పొడిచిన ఇద్దరు నిందితులను పోలీసులు పరేడ్ చేసి (Police parade accused) పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ‘ఖల్నాయక్’ పాటను ప్లే చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
భోపాల్: ముగ్గురు వ్యక్తులను కత్తితో పొడిచిన ఇద్దరు నిందితులను పోలీసులు పరేడ్ చేసి (Police parade accused) పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ‘ఖల్నాయక్’ పాటను ప్లే చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ సంఘటన జరిగింది. ఇటీవల సెక్టార్ 74 ప్రాంతంలో అమన్ వర్మ, రాహుల్ గుర్జార్, రాహుల్ మరాఠా అనే ముగ్గురు వ్యక్తులు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అమిత్ సోనీ, ప్రీతమ్ కుష్వాహా బలవంతంగా ఆ ప్రాంగణంలోకి ప్రవేశించారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో బర్త్ డే వేడుక జరుపుకున్న ముగ్గురు స్నేహితులను అమిత్, ప్రీతమ్ కలిసి కత్తితో పొడిచారు. తీవ్రంగా గాయపడిన ఆ ముగ్గురిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఇండోర్ పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు జరిపారు. ముగ్గురు స్నేహితులను కత్తితో పొడిచిన ఇద్దరు నిందితులు అమిత్ సోనీ, ప్రీతమ్ కుష్వాహాను శనివారం అరెస్ట్ చేశారు. జనమంతా చూస్తుండగా ఇద్దరు నిందితులను రోడ్డుపై నడిపించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీస్ వాహనంలో ‘ఖల్నాయక్’ సాంగ్ ప్లే చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నిందితులు చెవులు పట్టుకుని తమను క్షమించాలంటూ పోలీసులను ప్రాధేయపడ్డారు.
మరోవైపు స్థానికులు కొందరు తమ మొబైల్ ఫోన్లలో దీనిని రికార్డ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Watch : इंदौर में बीते दिनों जन्मदिन मना रहे युवकों पर चाकूबाजी करने वाले आरोपी गैंग को गिरफ्तार कर लिया गया है। पुलिस ने 'नायक नहीं खलनायक हूं मैं' गाना बजाकर आरोपियों का जुलूस निकाला। इतना ही नहीं बदमाशों से उठक-बैठक भी करवाई।#Indore #Police pic.twitter.com/Ry8OLAWVxx
— Hindustan (@Live_Hindustan) September 6, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

