Fertility Rate | 1950లో 6.2.. ఇప్పుడు 2 లోపే.. భారత్‌లో తగ్గిన సంతానోత్పత్తి రేటు
భారత్‌లో గత కొన్నేండ్లుగా సంతానోత్పత్తి రేటు భారీగా తగ్గిపోతున్నట్టు లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైంది. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్(జీబీడీ) అనే సంస్థకు చెందిన పరిశోధకులు చేసిన ఈ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మన దేశంలో 1950 సంవత్సరంలో 6.2గా ఉన్న సంతానోత్పత్తి రేటు 2021 నాటికి 2.0 దిగువకు తగ్గిపోయిందని ఈ అధ్యయనం పేర్కొన్నది.
- 2050 నాటికి 1.29కి తగ్గొచ్చు
- పేద దేశాల్లో అధిక సంతానోత్పత్తి
- లాన్సెట్ జర్నల్ అధ్యయనంలో వెల్లడి
Fertility Rate | న్యూఢిల్లీ, మార్చి 21: భారత్‌లో గత కొన్నేండ్లుగా సంతానోత్పత్తి రేటు భారీగా తగ్గిపోతున్నట్టు లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైంది. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్(జీబీడీ) అనే సంస్థకు చెందిన పరిశోధకులు చేసిన ఈ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మన దేశంలో 1950 సంవత్సరంలో 6.2గా ఉన్న సంతానోత్పత్తి రేటు 2021 నాటికి 2.0 దిగువకు తగ్గిపోయిందని ఈ అధ్యయనం పేర్కొన్నది. ఇది మరింత తగ్గబోతున్నదని, 2050 నాటికి 1.29కి, 2100 సంవత్సరానికికి 1.04కి తగ్గుతుందని అంచనా వేసింది.
- 1950లో భారత్‌లో ఒక మహిళ సగటున 4.8 పిల్లలకు జన్మనిస్తే.. 2021 నాటికి 2.2 పిల్లలకు జన్మనిచ్చిందని పేర్కొన్నది. ఇది మరింత తగ్గిపోనున్నదని, 2050 నాటికి ఒక మహిళ సగటున 1.8 మందికి, 2100 సంవత్సరం నాటికి 1.6 మందికి జన్మనివ్వవచ్చని ఈ అధ్యయనం అంచనా వేసింది.
- ప్రపంచంలో 1950లో 9.3 కోట్ల మంది జన్మించగా.. 2016లో అత్యధికంగా 14.2 కోట్ల మంది జన్మించారు. 2021 నాటికి జననాల సంఖ్య 12.9 కోట్లకు తగ్గిపోయింది. భారత్‌లో 1950లో 1.6కోట్ల మంది జన్మించగా, 2021లో 2.2 కోట్ల మంది జన్మించారు. 2050లో 1.3 కోట్ల మంది జన్మించివచ్చని ఈ సంస్థ అంచనా.
- 21వ శతాబ్దంలో చాలా దేశాలు తక్కువ సంతానోత్పత్తి సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ అల్పాదాయ దేశాలు మాత్రం అధిక సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్నాయని జీబీడీ పేర్కొన్నది. 2021లో మొత్తం ప్రపంచ జననాల్లో పేద దేశాల్లో 18 శాతం ఉండగా, 2100 నాటికి 35 శాతం వరకు పెరగవచ్చని అంచనా వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

