Aging Out | ఏజింగ్ అవుట్.. అమెరికాలో భారత సంతతి యువతకు బహిష్కరణ ముప్పు
వారంతా చిన్నతనంలో తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లారు. అక్కడే చదువుకున్నారు. కుటుంబం, స్నేహితులు, వృత్తి అంతా అక్కడే. కానీ, ఉన్నఫళంగా అన్నింటినీ వదిలేసి, దేశాన్ని విడిచి వారి సొంత దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
- అమెరికాలో 2.50 లక్షల మంది ‘ఏజింగ్ అవుట్’
- వీరిలో సగం మంది భారతీయ యువతీ యువకులే
- 21 ఏండ్లు వయస్సుతో ఇక ‘డిపెండెంట్’లు కాదు
- గ్రీన్‌కార్డులు, ఇతర వీసాల కోసం ఎదురుచూపులు
- రాకపోతే అమెరికా నుంచి బయటకు వెళ్లాల్సిన స్థితి
Aging Out | న్యూఢిల్లీ, జూలై 27: వారంతా చిన్నతనంలో తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లారు. అక్కడే చదువుకున్నారు. కుటుంబం, స్నేహితులు, వృత్తి అంతా అక్కడే. కానీ, ఉన్నఫళంగా అన్నింటినీ వదిలేసి, దేశాన్ని విడిచి వారి సొంత దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అమెరికాలో దాదాపు 2.50 లక్షల మంది యువతీ యువకులు ఎదుర్కొంటున్న ‘ఏజింగ్ అవుట్’ ముప్పు సమస్య ఇది. వీరిలో భారత సంతతికి చెందిన వారే దాదాపు సగం మంది ఉంటారని అంచనా. ఈ నేపథ్యంలో వీరి భవిష్యత్తు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉంది.
21 ఏండ్లు రాగానే అమెరికాను వీడాల్సిందే
భారత్ సహా వేర్వేరు దేశాల నుంచి అమెరికాకు తాత్కాలిక వర్క్ వీసాల మీద వెళ్లిన వ్యక్తులు పిల్లలను కూడా తమతో తీసుకెళ్లవచ్చు. ఈ పిల్లలు తల్లిదండ్రులపై ‘డిపెండెంట్(ఆధారపడినవారు)’ హోదాతో అమెరికాలో ఉండేందుకు వీలు ఉంటుంది. అయితే, వీరికి 21 ఏండ్ల వయస్సు వచ్చినా, వివాహం జరిగినా డిపెండెంట్ హోదా కోల్పోతారు. అంతలోపు వారికి గ్రీన్ కార్డు, ఇతర వీసా ఏదైనా రాకపోతే వారు బలవంతంగా అమెరికా నుంచి వారి సొంత దేశాలకువెళ్లిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ సమస్యనే ‘ఏజింగ్ అవుట్’ అంటారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనే యువతీ యువకులను ‘డాక్యుమెంటెడ్ డ్రీమర్స్’ అని పిలుస్తారు. అయితే, అమెరికాలో స్థిరపడటానికి ఇచ్చే గ్రీన్ కార్డుల జారీ చాలా ఆలస్యమవుతున్నది. ఏండ్ల తరబడి గ్రీన్ కార్డు కోసం ఎదురుచూడాల్సి వస్తున్నది. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ(ఎన్ఎఫ్ఏపీ) నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ప్రస్తుతం 12 లక్షల మంది ఈబీ-1, ఈబీ-2, ఈబీ-3 కేటగిరీల్లో గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపులు
అమెరికాలో పెరిగి, చదువుకున్న యువత ఇలా దేశం నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటం పట్ల ఆందోళన వ్యక్తం అవుతున్నది. వీరికి ఉపయోగపడేలా తీసుకువచ్చిన ఒక ఒప్పందాన్ని రెండుసార్లు రిపబ్లికన్లు ఆమోదం పొందకుండా అడ్డుపడ్డారని వైట్‌హౌస్ పత్రికా కార్యదర్శి కరైన్ జీన్ పియెర్రీ ఆరోపించారు. ‘ఏజింగ్ అవుట్’ ముప్పు ను ఎదుర్కొంటున్న యువత కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని 43 మంది చట్టసభ్యులు బైడెన్ ప్రభుత్వాన్ని కోరినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. భారత్ నుంచి చిన్నతనంలో వెళ్లి అమెరికాలో స్థిరపడ్డ ద్వారకేశ్ పటేల్ అనే ప్రముఖ పోడ్కాస్టర్ కూడా ఇటీవల ఈ ముప్పును ఎదుర్కొన్నారు. అదృష్టవశాత్తూ హెచ్-1బీ లాటరీలో వీసా దక్కడంతో అమెరికాలో ఉండగలిగానని, లేకపోతే భారత్‌కు తిరిగి వెళ్లాల్సి వచ్చేదని ద్వారకేశ్ తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇలాంటి పరిస్థితినే వేలాది మంది భారతీయ యువతీ యువకులు ఎదుర్కొంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

