Australia Visa | పెరిగిన ఆస్ట్రేలియా వీసా తిరస్కరణలు.. ఆందోళనలో భారతీయ విద్యార్థులు
ఇటీవల ఆస్ట్రేలియా వీసా దరఖాస్తులు భారీగా తిరస్కరణకు గురవుతున్న నేపథ్యంలో భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పలు యూనివర్సిటీలు విద్యార్థుల ఆడ్మిషన్ల ఆఫర్లను ఉపసంహరించుకొంటున్న కారణంగా వీసాల తిరస్కరణ పెరిగిందని స్థానిక మీడియా నివేదికలు చెబుతున్నాయి.
Australia Visa | న్యూఢిల్లీ: ఇటీవల ఆస్ట్రేలియా వీసా దరఖాస్తులు భారీగా తిరస్కరణకు గురవుతున్న నేపథ్యంలో భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పలు యూనివర్సిటీలు విద్యార్థుల ఆడ్మిషన్ల ఆఫర్లను ఉపసంహరించుకొంటున్న కారణంగా వీసాల తిరస్కరణ పెరిగిందని స్థానిక మీడియా నివేదికలు చెబుతున్నాయి. దరఖాస్తు సరిగా లేదన్న కారణంతో యూనివర్సిటీ ఆఫ్ వొలోంగాంగ్, లా ట్రోబ్ యూనివర్సిటీలు పలువురు విద్యార్థులకు ఆఫర్లను ఉపసంహరించాయని టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ పేర్కొన్నది. అయితే ఈ ఆరోపణలను ఆ రెండు వర్సిటీలు ఖండించాయి.
తగ్గనున్న విదేశీ విద్యార్థుల సంఖ్య
ఓ వైపు విద్యార్థుల దరఖాస్తులను తాము తిరస్కరించడం లేదని ఆస్ట్రేలియా యూనివర్సిటీలు చెబుతున్నాయి. అయితే ఇటీవలి స్టడీ వీసా దరఖాస్తుల విషయంలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నదని విదేశీ విద్యా నిపుణులు అంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆస్ట్రేలియాలో మొత్తం విదేశీ విద్యార్థుల సంఖ్య 3,75,000కు తగ్గుతుందని, తర్వాతి ఏడాదికి రెండున్నర లక్షలకు పడిపోతుందనే అంచనాలు ఉన్నాయని ఇన్ఫైనెట్ గ్రూపు సీఈవో గౌరవ్ బాత్రా అన్నారు.
ఈ వీసా దరఖాస్తుల తిరస్కరణల ప్రభావం, ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కఠిన నిబంధనలను గమనించదగినవని పేర్కొన్నారు. అధికారులు సరైన సమాచారం ఇవ్వకుండా చాలా దరఖాస్తులను తిరస్కరించారని, ఇది ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియా రావాలనుకొంటున్న విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. తాజా పరిణామాల నేపథ్యంలో పలువురు విద్యార్థులు న్యూజిలాండ్, ఇతర దేశాల వైపు చూస్తున్నారు. తప్పుడు పత్రాలు సమర్పించడం వంటివి వీసా తిరస్కరణకు కారణాలుగా ఉండొచ్చని ఈఎస్ఎస్ గ్లోబల్ డైరెక్టర్ రోహిత్ సేథి చెబుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

