ఆర్థిక వ్యవస్థపై కొవిడ్ ఎఫెక్ట్ తగ్గింది: ఆర్బీఐ
RBI on Corona effect: కరోనా ఫస్ట్ వేవ్‌తో పోల్చితే భారత ఆర్థిక వ్యవస్థపై సెకండ్ వేవ్ ప్రభావం తక్కువగానే ఉన్నదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

న్యూఢిల్లీ: కరోనా ఫస్ట్ వేవ్‌తో పోల్చితే భారత ఆర్థిక వ్యవస్థపై సెకండ్ వేవ్ ప్రభావం తక్కువగానే ఉన్నదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అయితే అనిశ్చిత పరిస్థితులు స్వల్పకాలిక నిరోధంగా పనిచేసే అవకాశం ఉందని పేర్కొన్నది. పునరుత్తేజానికి ప్రైవేట్ డిమాండ్ చాలా ముఖ్యమైనదని వివరించింది. కొవిడ్-19 రెండో ప్రభంజనం విజృంభణను ఎంత వేగంగా మన దేశం అడ్డుకోగలదనేదానిపైనే దేశ వృద్ధి అవకాశాలు ఆధారపడినట్లు తెలిపింది. గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ అంశాలను వివరించింది.
కరోనా మహమ్మారి తర్వాత స్వయం సమృద్ధ జీడీపీ వృద్ధి పథం కోసం ప్రైవేటు వినియోగం, పెట్టుబడుల డిమాండ్ చెప్పుకోదగిన స్థాయిలో పునరుద్ధరణ జరుగాలని ఆర్బీఐ నివేదిక పేర్కొన్నది. ప్రైవేటు వినియోగం, పెట్టుబడుల డిమాండ్ వాటా జీడీపీలో దాదాపు 85 శాతం వరకు ఉంటుందని తెలిపింది. సాధారణంగా పెట్టుబడుల కంటే వినియోగం ద్వారానే సంక్షోభానంతరం కోలుకోవడం ఎక్కువగా జరుగుతుందని, అయితే పెట్టుబడుల ద్వారా కోలుకోవడంవల్ల మరింత గట్టిగా నిలదొక్కుకోవడం సాధ్యమవుతుందని వివరించింది.
ఆర్థిక సంవత్సరం 2021లో ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ 6.99 శాతం పెరిగి, రూ.57.08 ట్రిలియన్లకు పెరిగినట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఆదాయం 10.96 శాతం తగ్గిందని, అదే సమయంలో ఖర్చు కూడా 63.10 శాతం తగ్గిందని తెలిపింది. విదేశీ మారక ద్రవ్య లావాదేవీల నుంచి నెట్ గెయిన్స్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.29.993 బిలియన్లు అని, ఈ ఆర్థిక సంవత్సరంలో 506.29 బిలియన్లు అని వివరించింది. గత వారం ప్రభుత్వానికి అందజేసిన మిగులు నిధుల్లో అధిక వాటా దీని నుంచే వచ్చినట్లు తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

