Operation Moti: ఏనుగును కాపాడేందుకు.. ఎన్జీవోకు సహకరిస్తున్న ఆర్మీ
మోతీ చికిత్సకు సహకరించేందుకు బెంగాల్‌కు చెందిన ఆర్మీ ఇంజినీర్లు ముందుకు వచ్చారు. 24 గంటల్లో ప్రత్యేక టవర్ కట్టారు. ఆ ఏనుగు తన కాళ్లపై నిలబడేందుకు ప్రత్యేక పుల్లీలను ఏర్పాటు చేశారు.
డెహ్రాడూన్: అనారోగ్యంతో కుప్పకూలిన ఏనుగును కాపాడేందుకు ఒక ఎన్జీవో సంస్థకు ఆర్మీ ఇంజినీర్లు సహకరిస్తున్నారు. చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లతో ఆ ఏనుగును పైకి లేపారు. ఈ అరుదైన సంఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. మోతీ అనే 35 ఏళ్ల ఏనుగు ఎంతో మందిని తనపై ఎక్కించుకుని షికారు తిప్పింది. దాని కాళ్లు అరిగిపోవడంతో అనారోగ్యానికి గురైంది. జనవరి 22న ఒక ప్రాంతంలో కుప్పకూలింది. ఆహారం, చికిత్స లేక నీరసించిపోయింది. లేవలేని స్థితిలో ఉన్న ఆ ఏనుగు మెల్లగా చావుకు దగ్గరవుతున్నది.
కాగా, వన్యప్రాణులను సంరక్షించే ఎన్జీవో సంస్థకు ఆ ఏనుగు పరిస్థితి తెలిసింది. దీంతో ఆ సంస్థకు చెందిన ఎమర్జెన్సీ బృందం వెంటనే ఏనుగు పడి ఉన్న చోటుకు వెళ్లింది. మెడికల్ టీం గత కొన్ని రోజులుగా దానికి చికిత్స చేస్తున్నారు. అయితే ఆ ఏనుగు చాలా రోజులుగా ఒకవైపు పడి ఉండటంతో చికిత్స అందించేందుకు ఎన్జీవో బృందానికి ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ సహాయాన్ని ఆ ఎన్జీవో సంస్థ కోరింది. దీంతో మోతీ చికిత్సకు సహకరించేందుకు బెంగాల్‌కు చెందిన ఆర్మీ ఇంజినీర్లు ముందుకు వచ్చారు. 24 గంటల్లో ప్రత్యేక టవర్ కట్టారు. ఆ ఏనుగు తన కాళ్లపై నిలబడేందుకు ప్రత్యేక పుల్లీలను ఏర్పాటు చేశారు. దీంతో వైద్య బృందం దానికి తగిని విధంగా చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు ఆర్మీ సహాయానికి ఆ ఎన్జీవో సంస్థ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. అసాధ్యమైన పనిని ఐక్యతతో కొంతమేర సాధ్యం చేసినట్లు చెప్పింది. దీనికి సంబంధించిన ఒక ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందరి సహకారంతో ఏమైనా సాధించగలం అనేందుకు ఈ ఫొటో నిదర్శనం అని పేర్కొంది. మోతీ ఆరోగ్యం మెరుగుపడేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు ఆ ఎన్జీవో సంస్థ వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

