Indian scientists: ఇద్దరు భారత సంతతి శాస్త్రవేత్తలకు అమెరికా సైంటిఫిక్ అవార్డు
Indian scientists: భారత సంతతి శాస్త్రవేత్తలు అశోక్ గాడ్గిల్, సుబ్రా సురేశ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆ ఇద్దరికీ టెక్నాలజీ, ఇన్నోవేషన్ పురస్కారాన్ని అమెరికా సర్కార్ అందజేసింది. అధ్యక్షుడు బైడెన్ చేతుల మీదుగా ఆ ఇద్దరూ మెడల్స్ అందుకున్నారు.
న్యూఢిల్లీ: ఇద్దరు భారతీయ సంతతి శాస్త్రవేత్తల(Indian scientists)కు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. అశోక్ గాడ్గిల్, సుబ్రా సురేశ్‌లకు నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ అవార్డు దక్కింది. అమెరికాలో టెక్నాలజీ రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డు ఇదే కావడం విశేషం. మంగళవారం రోజున ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఈ పతకాలను అందజేశారు.
అశోక్ గాడ్గిల్ ప్రస్తుతం కాలిఫోర్నియా వర్సిటీలో ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. లారెన్స్ బెర్కిలీ నేషనల్ ల్యాబ్‌లో సీనియర్ సైంటిస్టుగా ఉన్నారు. సుస్థిర అభివృద్ధి రంగంలో ఆయన ఆవిష్కకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. శుద్ధ నీరు, ఇంధనం, శానిటేషన్ డెవలప్మెంట్కు అవసరమైన సమర్థ సాంకేతిక విధానాలను ఆయన డెవలప్ చేశారు. ముంబైలో గాడ్గిల్ జన్మించారు. ముంబై వర్సిటీలో ఆయన ఫిజిక్స్ చదివారు. కాన్పూర్‌లో ఐఐటీ పీజీ చేశారు. బెర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి ఎంఎసీ, పీహెచ్డీ పూర్తి చేశారు.
మరో శాస్త్రవేత్త సుబ్రా సురేశ్.. అమెరికాలో బయో ఇంజినీర్‌గా చేస్తున్నారు. గతంలో మాసాచుసెట్స్ టెక్నాలిజీ ఇన్స్టిట్యూట్లో డీన్ గా చేశారు. ఇంజినీరింగ్, ఫిజికల్ సైన్సెస్, లైఫ్ సెన్సెస్, మెడిసిన్ రంగాల్లో పరిశోధన చేశారు. ఎంఐటీలో ఓ విభాగానికి అధిపతిగా పనిచేసిన తొలి ఆసియా వ్యక్తిగా సురేశ్ రికార్డు క్రియేట్ చేశాడు. సైంటిస్టు సరేశ్ ముంబైలో జన్మించారు. మద్రాసు ఐఐటీలో బీటెక్ చేశారు. ఐయోవా స్టేట్ వర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేశారు. ఎంఐటీ నుంచే పీహెచ్డీ కూడా పూర్తి చేశారు.
శాస్త్ర సాంకేతిక రంగానికి అసాధారణ రీతిలో సేవలందించినందుకు ప్రత్యేక గుర్తింపు అమెరికా ప్రభుత్వం నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అవార్డులను అందజేస్తుంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఉన్న సవాళ్లను ఈ యోధులను ఎదుర్కొన్నారని, ఇన్నోవేటివ్ విధానాలతో సమస్యలను పరిష్కరించారని అమెరికా సర్కారు ఓ ప్రకటనలో తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

