Restrictions on Imports | ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల దిగుమతిపై కేంద్రం ఆంక్షలు!
ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, వ్యక్తిగత కంప్యూటర్ల దిగుమతిపై (Imports) కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు (Restrictions) విధించింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది.
న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, వ్యక్తిగత కంప్యూటర్ల దిగుమతిపై (Imports) కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు (Restrictions) విధించింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది. చట్టబద్ధమైన అనుమతి ఉన్నవారికే అదికూడా పరిమిత సంఖ్యలో దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తామని పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంతో దేశీయంగా కంప్యూటర్ల తయారీకి ఊతమందుతుందని (Local manufacturing) పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
దేశంలో ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్, పర్సనల్ కంప్యూటర్ల తయారీకి స్ఫూర్తినిస్తుందని మాన్యుఫ్యాక్షరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంఘం మాజీ డైరెక్టర్ జనరల్ అలీ అక్తర్ జాఫ్రీ అన్నారు. కాగా, ఏప్రిల్-జూన్ నెలల్లో ట్యాబ్‌లు కంప్యూటర్లతో సహా ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులు 19.7 బిలియన్ డాలర్లకు చేరాయన్నారు. గతేడాదితో పోల్చితే ఇది 6.25 శాతం అధికమని చెప్పారు.
దేశీయ మార్కెట్లో అసర్, శాంసంగ్, ఎల్జీ, పానాసోనిక్, ఆపిల్, లెనొవో, హెచ్‌పీ, డెల్ వంటి కంపెనీల ల్యాప్‌టాప్‌ల అధికంగా అమ్ముడవుతున్నాయి. వీటిలో ఎక్కువగా చైనా నుంచే దిగుమతి అవుతుండటం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- acer
- Apple
- Dell
- Electronics imports
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

