Unemployment | దేశంలో నానాటికీ పెరుగుతున్న నిరుద్యోగం.. గ్రామీణ ప్రాంతాల్లో మరింత ఎక్కువ: సీఎంఐఈ
దేశంలో నిరుద్యోగం నానాటికీ పెరుగుతున్నదని, గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువ ఉన్నదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ(సీఎంఐఈ) నిర్వహించిన సర్వేలో తేలింది. మే నెలలో 7 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు జూన్‌లో 9.2 శాతానికి పెరిగినట్టు సీఎంఐఈ వెల్లడించింది.
- జూన్ నెలలో ఎనిమిది నెలల గరిష్టానికి..
- గ్రామీణ ప్రాంతాల్లో మరింత అధికం
- దేశంలో 9.2 శాతానికి పెరిగిన నిరుద్యోగిత రేటు
Unemployment | న్యూఢిల్లీ, జూలై 4: దేశంలో నిరుద్యోగం నానాటికీ పెరుగుతున్నదని, గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువ ఉన్నదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ(సీఎంఐఈ) నిర్వహించిన సర్వేలో తేలింది. మే నెలలో 7 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు జూన్‌లో 9.2 శాతానికి పెరిగినట్టు సీఎంఐఈ వెల్లడించింది.
గత ఏడాది జూన్‌లో 8.5 శాతంగా నిరుద్యోగ రేటు ఉండగా, ఈ జూన్‌లో 0.7 శాతం ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది. మహిళల్లో నిరుద్యోగం మరింత ఎక్కువగా ఉంది. గత ఏడాది జూన్‌లో 15.1 శాతంగా ఉన్న మహిళల నిరుద్యోగ రేటు ఈసారి జూన్‌లో 18.5 శాతానికి పెరిగింది. పురుషుల విషయానికి వస్తే.. గత ఏడాది జూన్‌లో 7.7 ఉండగా ఈ జూన్‌లో 7.8 శాతం ఉన్నట్టు ఈ సర్వేలో తేలింది.
గ్రామీణ ప్రాంతాల్లో అధికం
గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగం ఎక్కువగా ఉన్నట్టు ఈ సర్వే తేల్చింది. గ్రామీణ ప్రాంతాల్లో మే నెలలో 6.3 శాతంగా ఉన్న నిరుద్యోగం జూన్‌లో 9.3 శాతానికి పెరిగింది. గత ఏడాది జూన్‌లో 8.8 శాతం ఉండగా, ఇప్పుడు 0.5 శాతం ఎగబాకింది. గ్రామీణ పురుషుల్లో నిరుద్యోగం మే నెలలో 5.4 శాతం ఉండగా జూన్‌లో 8.2 శాతానికి పెరిగింది. గ్రామీణ మహిళల్లో 12.0 శాతం నుంచి 17.1 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం పెరుగుదల కాస్త తక్కువగా ఉంది. మే నెలలో 8.6 శాతం నిరుద్యోగ రేటు ఉండగా జూన్‌లో 8.9 శాతానికి పెరిగింది.
గ్రామీణ మహిళల కంటే పట్టణ మహిళల్లోనే నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు. పట్టణ మహిళల్లో మే నెలలో 18.53 శాతంగా ఉన్న నిరుద్యోగం జూన్‌లో ఏకంగా 21.36 శాతానికి పెరిగింది. కాగా, కార్మిక భాగస్వామ్య రేటు(ఎల్పీఆర్) మేలో 40.8 శాతం, గత ఏడాది జూన్‌లో 39.9 శాతం ఉండగా ఈ జూన్‌లో మాత్రం 41.4 శాతానికి పెరిగింది. 15 ఏండ్లు పైబడిన మొత్తం జనాభాలో ఉద్యోగం చేస్తున్నవారు, చేయాలనుకుంటున్న వారు, ఎదురుచూస్తున్న వారిని కలిపి ఎల్పీఆర్గా లెక్కగడతారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
CM’s Vigilance Cell Officer | సీఎం విజిలెన్స్ సెల్ అధికారి.. హోటల్ రూమ్‌లో మృతి
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

