PM Modi | ఆవిష్కరణలు జరగని దేశంలో అభివృద్ధి నిలిచిపోతుంది: ప్రధాని మోదీ
ఈ ఏడాది దేశం ఎన్నో ఘనతలు సాధించిందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మహిళా బిల్లు ఆమోదం పొందిందని చెప్పారు.
న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశం ఎన్నో ఘనతలు సాధించిందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మహిళా బిల్లు ఆమోదం పొందిందని చెప్పారు. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారడంపై ప్రజలు లేఖలు రాసి సంతోషం వ్యక్తంచేశారన్నారు. జీ20 విజయవంతంపై ప్రజలు లేఖలు రాసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ ఏడాది చివరి ఆదివారం కావడంతో మన్‌కీబాత్ (Mann Ki Baat) కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. దేశప్రజలందరికీ కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఏమన్నారంటే.. ‘ప్రస్తుతం దేశంలోని ప్రతి ప్రాంతం ఆత్మవిశ్వాసంతో నిండి ఉంది. దేశ ప్రజల్లో వికసిత్, ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తి రగిలించింది. 2024లోనూ ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించాలి. దీపావళి సందర్భంగా దేశీయ ఉత్పత్తుల ద్వారా మన శక్తిని నిరూపించాం.
చంద్రయాన్-3 విజయవంతంపై ఇప్పటీకీ సందేశాలు వస్తున్నాయి. శాస్త్రవేత్తల కృషితో చంద్రయాన్ విజయవంతమవడం అందరికీ గర్వకారణం.‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ దక్కడంతో దేశం మొత్తం ఉర్రూతలూగింది. ఎలిఫెంట్ విస్పరర్స్‌కు అవార్డు దక్కడంతో భారతీయుల ప్రతిభ వెలుగుచూసింది. భారత సృజనాత్మకతను ప్రపంచవ్యాప్తంగా చాటాం.
ఈ ఏడాది క్రీడాకారుల ఘనతలు దేశం గర్విచేలా చేశాయి. క్రీడల్లో మన అథ్లెట్లు అద్భుత ప్రతిభ చూపారు. ఆసియా క్రీడల్లో 107, పారా గేమ్స్‌లో 111 పతకాలతో సత్తాచాటారు. వన్డే ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు అందరి మనసులు దోచింది. అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో మహిళల జట్టు విజయం ప్రేరణగా నిలుస్తుంది. 2024 పారిస్ ఒలింపిక్స్‌కు భారత క్రీడాకారులు సన్నద్ధమవుతున్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, మేరీ మాటీ-మేరా దేశ్ వంటి కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించాం. ఈ కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజలు భాగస్వాములయ్యారు. దేశంలో 70 వేలకుపైగా అమృత్ సరోవర్లను నిర్మించాం. ఆవిష్కరణలు జరగని దేశంలో అభివృద్ధి నిలిచిపోతుంది. సరికొత్త ఆవిష్కరణలతో భారత్ ఇన్నోవేషన్ హబ్‌గా మారింది. 2015లో 81వ ర్యాంకులో ఉన్న మనం.. ప్రస్తుతం 40వ స్థానానికి చేరాం. ఈ ఏడాది భారత్ నుంచి దరఖాస్తు చేసే పేటేంట్ల సంఖ్య పెరిగింది. దేశ ప్రజల శక్తిసామర్థ్యాలు అందికీ ప్రేరణగా నిలుస్తాయి.’ అని ప్రధాని మోదీ అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

