నేడు సీఈసీపై ‘ప్రజా అభిశంసన’
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌పై ఈనెల 30న ఇండియా కూటమి నిర్వహించబోయే ‘ప్రజా అభిశంసన’ కార్యక్రమానికి లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షత వహించనున్నారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 29: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌పై ఈనెల 30న ఇండియా కూటమి నిర్వహించబోయే ‘ప్రజా అభిశంసన’ కార్యక్రమానికి లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షత వహించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీర్మానం ఆమోదించడానికి ముందు ముగింపు ప్రసంగం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
దేశంలో జరిగే ఓటు చోరీ అరాచకాన్ని ప్రజలకు వివరించేందుకు చేపట్టిన ఈ ప్రజా అభిశంసన కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలనే దానిపై నేతలు ఖర్గే నివాసంలో సమావేశమై ఒక కార్యాచరణను రూపొందించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్, టీఎంసీ నేత ఒబ్రెయిన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

