24 గంటల్లో రెండు ఎన్కౌంటర్లు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
Kulgam Encounter: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత 24 గంటల వ్యవధిలోనే కుల్గామ్ జిల్లాలోని
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత 24 గంటల వ్యవధిలోనే కుల్గామ్ జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నాయి. బట్పోరా, అహ్వాతూ ఏరియాల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్లలో మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
బట్పోరా ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో జైష్ ఎ మహ్మద్ సంస్థకు చెందిన పాకిస్థాన్ ఉగ్రవాది హతమయ్యాడు. కశ్మీర్ ఏరియాలో జరిగిన పలు ఉగ్రవాద కార్యకలాపాల్లో అతని హస్తం ఉన్నదని పోలీసులు తెలిపారు. ఇక అహ్వాతూ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో జైష్ ఎ మహ్మద్‌కే చెందిన స్థానిక ఉగ్రవాదులు హతమయ్యారు.
ఎన్కౌంటర్ ప్రదేశాల నుంచి భారీగా మారణాయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్‌కుమార్ తెలిపారు. ప్రస్తుతం కుల్గామ్ జిల్లాలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని, అయినప్పటికీ పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నదని ఆయన చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Y.S. Sharmila | ఎన్నికల్లో విజయం ప్రజా తీర్పు కాదు..అధికార మదంతో బలవంతపు గెలుపు : వైఎస్ షర్మిల
పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌పై అవగాహన శిబిరం
AP News | ఏపీలో గెలిచిన మేయర్లు, చైర్పర్సన్ల ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే ?
Jairam Ramesh | రాముడి పేరుతో పాపాలు ఇంకెన్నాళ్లు..? బీజేపీపై జైరాం రమేష్ ఆగ్రహం
Talasani Srinivas Yadav | ఆర్జేడీ నేత తేజస్విప్రసాద్ యాదవ్, ఎస్పీ నేతలకు తలసాని స్వాగతం.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

