Rajnath Singh | కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.. వైమానిక కమాండర్లకు రాజ్‌నాథ్ సింగ్ పిలుపు
Rajnath Singh | కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వైమానిక దళ కమాండర్లకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) పిలుపునిచ్చారు. రెండు రోజులు పాటు జరిగే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) కమాండర్ల కాన్ఫరెన్స్‌ను గురువారం ఆయన ప్రారంభించారు.
న్యూఢిల్లీ: కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వైమానిక దళ కమాండర్లకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) పిలుపునిచ్చారు. రెండు రోజులు పాటు జరిగే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) కమాండర్ల కాన్ఫరెన్స్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వైమానిక దళ టాప్ కమాండర్ల నుద్దేశించి రాజనాథ్ సింగ్ ప్రసంగించారు. వేగంగా మారుతున్న ప్రపంచ భౌగోళిక, రాజకీయ పరిస్థితులను పరిశీలించాలని తెలిపారు. భారత్ రక్షణపరంగా వాటిని అంచనా వేయాలని, ఆ మేరకు కార్యాచరణ సంసిద్ధతను పెంపొందించుకోవాలని అన్నారు. భారత వైమానిక రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడంతోపాటు డ్రోన్ల వినియోగంపై దృష్టి సారించాలని ఎయిర్‌ఫోర్స్ ఉన్నతాధికారులకు సూచించారు.
కాగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, హమాస్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ నేపథ్యంలో వివిధ వైమానిక వేదికల వినియోగాన్ని భారత్ ఎయిర్‌ఫోర్స్ కమాండర్లు విస్తృతంగా విశ్లేషిస్తున్నారని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, గ్లోబల్ సెక్యూరిటీ దృష్ట్యా కొత్త సవాళ్లు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. వాటిని ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని భారత వైమానిక దళ కమాండర్లకు సూచించారు. త్రివిధ దళాలు ఉమ్మడిగా ప్రణాళికలు, కార్యకలాపాలు అమలు చేయాలన్నారు.
మరోవైపు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, ఇతర కమాండర్లతో కలసి చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో భద్రతా పరిస్థితిని రాజ్‌నాథ్ సింగ్ సమీక్షించారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఎయిర్‌ఫోర్స్ డే పరేడ్, వైమానిక ప్రదర్శనను విజయవంతంగా నిర్వహించినందుకు ఐఏఎఫ్‌ను అభినందించారు. అలాగే హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో మానవతా సహాయం, విపత్తు సహాయ మిషన్లలో ఐఏఎఫ్ పాత్రను ప్రశంసించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- commanders
- conference
- Deal With
- IAF
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

