ఎయిర్‌లైన్స్ నిర్వాకం : ఫుడ్ ప్యాకెట్లో బొద్దింక ప్రత్యక్షం
ఎంతో డబ్బు వెచ్చించి కొనుగోలు చేసే ఆహార పదార్ధాల్లో పురుగులు రావడం ఎవరికైనా చేదు అనుభవమే.
న్యూఢిల్లీ : ఎంతో డబ్బు వెచ్చించి కొనుగోలు చేసే ఆహార పదార్ధాల్లో పురుగులు రావడం ఎవరికైనా చేదు అనుభవమే. విస్తారా ఫ్లైట్‌లో ఓ ప్రయాణీకుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. తనకు అందించిన ప్రీ ప్యాక్డ్ ఫుడ్‌లో బొద్దింకను చూసి నికుల్ సోలంకి అనే ప్రయాణీకుడు షాక్ తిన్నాడు.
Small cockroach in air Vistara meal pic.twitter.com/ebrIyszhvV
— NIKUL SOLANKI (@manikul008) October 14, 2022
ఆహారం సగం తిన్న తర్వాత అందులో ఉన్న బొద్దింకను గుర్తించాడు. తనకు ఎదురైన అనుభవాన్ని సోలంకి ట్విట్టర్లో షేర్ చేయడంతో పాటు ఎయిర్‌లైన్స్‌ను ట్యాగ్ చేశాడు. ట్వీట్‌ను గుర్తించిన ఎయిర్‌లైన్స్ సోలంకికి బదులిచ్చింది.
తాము అత్యధిక నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఆహారాన్ని సిద్ధం చేస్తామని పేర్కొంది. మీ విమాన వివరాలను పంపితే తాము ఈ అంశంపై దృష్టిసారించి వీలైనంత త్వరగా పరిస్ధితి చక్కదిద్దుతామని పేర్కొంది. విస్తారా సర్వీస్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన నెటిజన్లు విమానాలు లేదా ట్రైన్లలో ఆహారంలో పురుగులు రావడం సర్వసాధారణంగా మారిందని కామెంట్ సెక్షన్లో రాసుకొచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

