లక్నో : పెండ్లి తర్వాత బరువు పెరిగిందని భార్యకు విడాకులు ఇచ్చేందుకు ఓ వ్యక్తి సిద్ధమైన ఘటన యూపీలోని మీరట్‌లో వెలుగుచూసింది. పెండ్లి తర్వాత బరువు పెరిగినందుకు భర్త తన నుంచి విడాకులు కోరుతున్నాడని, తనకు న్యాయం చేయాలని నజ్మా అనే బాధితురాలు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది.
తాను లావయ్యానని అంటూ నెల కిందట భర్త సల్మాన్ తనను ఇంటి నుంచి గెంటేశాడని, ఇప్పుడు విడాకుల కోసం ప్రయత్నిస్తున్నాడని ఆమె వాపోయింది. నజ్మాను తరచూ భర్త బాడీ షేమింగ్ చేస్తుండటంతో ఏడేండ్ల కొడుకు ఎదుటే ఇద్దరూ తరచూ ఘర్షణ పడుతుంటారు.
నజ్మాను సల్మాన్ ఫ్యాట్ అని పిలుస్తూ ఆమె వంటి వారితో తాను కలిసి ఉండలేనని సతాయిస్తున్నాడు. తాను సల్మాన్‌తో కలిసి నివసించాలని కోరుకుంటున్నా ఆయన విడాకులు కోరుతున్నాడని నజ్మా చెప్పుకొచ్చింది. ఎన్నో సార్లు భర్తకు సర్ధిచెప్పినా ఫలితం లేకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.