న్యూయార్క్: రక్తంలో చక్కెర స్థాయిలు ఎంత ఉన్నాయి? జిమ్‌లో కసరత్తు కారణంగా కండరాలు, శరీరం ఏ మేరకు అలసిపోయాయి? స్నేహితులతో పబ్‌లో తెలియకుండానే మోతాదుకు మించి మద్యం తాగామా? వంటి విషయాలను సెకండ్ల వ్యవధిలో ఒకేసారి కచ్చితమైన రీడింగ్‌తో సూచించే సాధనమే ఇది. మైక్రోస్కోపిక్ సైజులో ఉండే ఈ డివైజ్‌ను భూజానికి ధరిస్తే, చర్మం కింది ద్రవపదార్థం నుంచి రీడింగ్‌ను సేకరిస్తుంది. బ్లూటూత్ సాయంతో స్మార్ట్‌ఫోన్‌కు ఆ వివరాలను పంపిస్తుంది. నొప్పి లేకుండా దీని ద్వారా చక్కెర స్థాయిలు కొలవవచ్చు. డయాబెటిక్స్‌కు దీనిని గేమ్‌ఛేంజర్‌గా భావిస్తున్నారు. కాలిఫోర్నియా పరిశోధకులు దీన్ని అభివృద్ధిచేశారు.