అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసి వేధింపులు.. 19 ఏళ్ల ఐఐటీ విద్యార్థి అరెస్టు

న్యూఢిల్లీ: ఢిల్లీలో పేరుగాంచిన ఓ స్కూల్‌కు చెందిన అమ్మాయిలు, టీచర్ల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న 19 ఏళ్ల ఐఐటీ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ కుర్రాడు ఖరగ్‌పూర్‌లోని ఐఐటీలో బీ.టెక్ చదువుతున్నాడు. బీహార్‌లోని పాట్నా అతని స్వంత పట్టణం. నార్త్ ఢిల్లీలో ఉన్న ఓ స్కూల్‌కు చెందిన 50 మంది విద్యార్థినులను, టీచర్లను అతను వేధించినట్లు పోలీసులు చెప్పారు. ఐఐటీ విద్యార్థిని మహావీర్‌గా గుర్తించారు. ఫేక్ కాలర్ ఐడీ కోసం అతను యాప్స్ వాడాడు. బాధితులతో లింకు ఏర్పర్చుకునేందుకు వాట్సాప్‌లో వర్చువల్ నెంబర్ల ద్వారా చాట్ చేశాడు. తానెవరో తెలియకుండా ఉండేందుకు వాయిస్ ఛేంజింగ్ యాప్‌ను కూడా అతను వాడాడు.
అమ్మాయిల పేర్లపై నకిలీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్‌ను క్రియేట్ చేసిన అతను .. బాధితుల మార్ఫింగ్ ఫోటోలను పోస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సైబర్ వేధింపులు జరుగుతున్న స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు చేసిన తర్వాత ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ద్వారా మైనర్ బాలికలను మహావీర్ వేధించినట్లు ఫిర్యాదులో తెలిపారు. వేరువేరు ఇంటర్నేషనల్ నెంబర్స్ నుంచి టీచర్లకు ఫోన్ కాల్ చేసి వేధించినట్లు తెలుస్తోంది. ఆన్లైన్ క్లాసుల కోసం క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూపుల్లోకి చొరబడి ఆ ఐఐటీ విద్యార్థి వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. మార్ఫింగ్ చేసిన అనేక మంది స్కూల్ విద్యార్థినుల ఫోటోలు సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అయినట్లు తెలుస్తోంది.
ఐపీసీలోని 354-డీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. పోక్సో చట్టం కింద కూడా కేసు బుక్ చేశారు. దర్యాప్తులో భాగంగా స్కూల్ విద్యార్థులు, టీచర్లు, పేరెంట్స్‌ను కూడా పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది. నిందితుడికి చెందిన 33 వాట్సాప్ వర్చువల్ నెంబర్లు, ఇన్‌స్టా ప్రొఫైల్స్, ఫేక్ కాలర్ ఐడీ యాప్‌లను పోలీసులు గుర్తించారు. వాట్సాప్, ఇన్‌స్టా, ఐడీల ఐపీ లాగిన్స్‌ను పరిశీలించిన తర్వాత ఆ నిందితుడు పాట్నా నుంచి ఆపరేట్ చేస్తున్నట్లు తేలిందని పోలీసులు చెప్పారు. మొబైల్ నెంబర్లను పరిశీలిస్తున్న పోలీసులకు మరో విషయం తెలిసింది. మూడేళ్ల క్రితం సేకరించిన ఓ నెంబర్‌కు ఫోన్ చేస్తూ నిందితుడు ఆ అమ్మాయిని వేధించినట్లు గుర్తించారు.
ఢిల్లీ స్కూల్‌కు చెందిన ఓ విద్యార్థినితో తొలుత కాంటాక్ట్‌లోకి వచ్చి ఆ తర్వాత వారి ఇన్‌స్టాగ్రామ్‌తో ఆ అమ్మాయి ఫ్రెండ్స్‌తో కాంటాక్ట్‌లోకి వచ్చాడు. యాప్ టెక్నాలజీలో మంచి నాలెడ్జ్ ఉన్న మహావీర్.. మైనర్ బాలికలను వేధించినట్లు డీసీపీ తెలిపారు. అసభ్యకర వీడియోలు, ఫోటోలను అతని మొబైల్ నుంచి సేకరించారు. మహావీర్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను సీజ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

