ఆన్లైన్ సాఫ్ట్వేర్ కోర్సులకు ఐఐటీ రూర్కీ దరఖాస్తుల ఆహ్వానం

ఢిల్లీ : సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్‌లో ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సుకు ఐఐటీ రూర్కీకి చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ ఐసీటీ అకాడమీ ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. గ్రేట్ లెర్నింగ్ అనే ఎడ్యూటెక్ కంపెనీని ప్రారంభించిన ఈ అండ్ ఐసీటీ అర్హులైన విద్యార్థుల నుండి eict.iitr.ac.in. ద్వారా ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. క్లౌడ్ కంప్యూటింగ్‌లో 10 నెలల పాటు స్పెషలైజేషన్ కోర్సు, స్వల్ప వ్యవధి సర్టిఫికేట్ ప్రొగ్రాంలో డేటా సైన్స్ కోసం పైథాన్, ఫ్రంట్ ఎండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
పరిశ్రమలు, కార్పొరేట్ వరల్డ్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించడం, వృత్తిని జీవితాన్ని మెరుగుపరచడం ఈ కోర్సుల లక్ష్యం. ఐఐటీ రూర్కీ నిపుణులు, ఇతర విద్యాసంస్థలు, పరిశ్రమ నిపుణుల సహాకారంతో ఆన్లైన్, సెల్ఫ్ పేస్డ్ లేదా హైబ్రీడ్ పద్ధతిలో శిక్షణ అందించబడుతుంది.
ఐఐటీ రూర్కీ డైరెక్టర్ ప్రొఫెసర్ అజిత్ కె చతుర్వేది మాట్లాడుతూ.. ఐఐటీ రూర్కీ, గ్రేట్ లెర్నింగ్‌ల మధ్య ఈ సహకారం యువత ప్రతిభను పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా రూపొందించడంలో సహాయపడుతుందని తాము విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచం డిజిటల్ ఎకానమీ వైపు వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఈ నైపుణ్యాలు భారతదేశ యువ శ్రామిక శక్తిని బాగా పెంచుతాయన్నారు. అదేవిధంగా ఇది డిజిటల్ ఇండియా మిషన్‌ను బలోపేతం చేయడానికి కూడా సహాయ పడుతుందని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ T20I | న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

